Allu Arjun: ఈసారి నేషనల్ అవార్డ్స్ టాలీవుడ్ కి చాలా ప్రత్యేకం. కొన్ని అరుదైన విజయాలు సొంతం అయ్యాయి. ఆర్ ఆర్ ఆర్, పుష్ప వంటి భారీ చిత్రాలతో పాటు ఉప్పెన వంటి చిన్న చిత్రాలు కూడా సత్తా చాటాయి. మొత్తంగా టాలీవుడ్ కి 11 అవార్డులు దక్కాయి. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో తెలుగు చిత్రాలు జాతీయ అవార్డులు అందుకోలేదు. వీటన్నింటిలో అల్లు అర్జున్ గెలుచుకున్న అవార్డు చాలా ప్రత్యేకం. ఆయన జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కైవసం చేసుకున్నాడు. ఇది అరుదైన ఘనత.
దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రలో ఉత్తమ్ నటుడు అవార్డు గెలుచుకున్న నటుడు లేడు. మొట్టమొదటిసారి టాలీవుడ్ హీరో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కొల్లగొట్టాడు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 1లో నటనకు గానూ అల్లు అర్జున్ ఈ అవార్డు అందుకున్నారు. నేడు ఢిల్లీ వేదికగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీద విజేతలకు అవార్డుల ప్రదానం జరిగింది. అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా ఈవెంట్లో పాల్గొన్నారు.
తెల్లని సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన అల్లు అర్జున్ వేదికపైకి వెళ్లి అవార్డు స్వీకరించారు. ఈ వేడుకలో భార్య స్నేహారెడ్డి, తండ్రి అల్లు అరవింద్ సైతం పాల్గొన్నారు. అల్లు అర్జున్ తో పాటు మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమకు ఇది ప్రౌడ్ మూమెంట్ అని చెప్పొచ్చు. అల్లు అర్జున్ తన అద్భుత నటనతో టాలీవుడ్ కి ఉత్తమ నటుడు అవార్డు తెచ్చిపెట్టాడు. పుష్ప పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటింది. వరల్డ్ వైడ్ రూ. 360 కోట్ల వసూళ్ల వరకూ రాబట్టింది.
ఇక పుష్ప కి సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. దర్శకుడు సుకుమార్ రూ. 350 కోట్ల బడ్జెట్ తో భారీగా తెరకెక్కిస్తున్నాడు. పుష్ప 2 వచ్చే ఏడాది ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదల కానుంది. రష్మిక మందాన హీరోయిన్. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ వంటి నటులు కీలక రోల్స్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు.
TFI PRIDE ALLUARJUN
Huge CONGRATULATIONS to #AlluArjun for winning the prestigious National Award for the film #Pushpa.
Allu Arjun becomes the FIRST ever actor from TFI to win the #NationalAward.
The expectations for #Pushpa2TheRule has… pic.twitter.com/iNFLwiMZw5
— Manobala Vijayabalan (@ManobalaV) October 17, 2023