Allu Arjun Negative Role: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వాళ్ళు ప్రస్తుతం పాన్ ఇండియా బాట పడుతున్నారు. ఇప్పటికే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ లను బ్రేక్ చేసినవాళ్లు కూడా ఉన్నారు.ప్రస్తుతం స్టార్ హీరోలు సైతం డిఫరెంట్ సినిమాల వైపు అడుగు వేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోలు పెద్దగా వాళ్ళ సత్తా చూపించనప్పటికి రీసెంట్ గా రన్వీర్ సింగ్ ‘దురంధర్ 2’ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. కాబట్టి వాళ్ళని బీట్ చేయాలంటే మనవాళ్లు సైతం మరోసారి సంచలనాలను క్రియేట్ చేసే సినిమాలను చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి సినిమాలు వచ్చినప్పుడే తెలుగు సినిమా పొటెన్షియాలిటి పెరుగుతుందని కూడా ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. ఇక ఇప్పుడు మన స్టార్ హీరోలు వరుస విజయాలను సాధిస్తూ ఇండస్ట్రీ స్థాయిని పెంచాల్సిన అవసరం ఉంది. ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోలు సైతం ఇప్పుడు నెగెటివ్ రోల్స్ మీద ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు.
కారణం ఏంటి అంటే హీరోగా కనిపిస్తే ఎప్పుడు మంచిగానే ఉండాలి. అలాంటి పాత్రలనే చేయాలి. అలా చేయడం వల్ల మూస ధోరణిలో యాక్టింగ్ చేసినట్టుగా అనిపిస్తుందట. ఎప్పుడు అవే ఫైట్లు అవే సన్నివేశాలు, సెంటిమెంట్ సీన్స్ చేయాల్సి వస్తుందట. విలన్ అయితే డిఫరెంట్ యాంగిల్ లో నటించేంత స్వేచ్ఛ ఉంటుంది.
అలాగే నెగెటివ్ రోల్ లో యాక్టింగ్ చేసి ఆకట్టుకున్నప్పుడే ఒక హీరోకి గానీ నటుడికి గాని చాలా మంచి గుర్తింపు వస్తుంది. ఇక అదే విధంగా ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాలో అల్లు అర్జున్ నెగెటివ్ పాత్రలో కూడా నటిస్తున్నాడట. ఇక రామ్ చరణ్ సైతం సుకుమార్ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి…
నిజంగా ఇది కనక నిజమైతే స్టార్ హీరోల ఆలోచన ధోరణి మారిపోతున్నందుకు సంతోషపడాలి. ఇక దానికి తోడుగా ఇతరుల హీరోల సినిమాల్లో కూడా మంచి పాత్రలు దొరికితే విలన్స్ గా నటించడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ కొంతమంది స్టార్ హీరోలు చెబుతుండటం విశేషం…
