Allu Arjun weakness: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్… పుష్ప సినిమా ముందు వరకు ఆయన స్టైలిష్ స్టార్ గా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. పుష్ప సినిమా నుంచి ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. అప్పటినుంచి తన స్టార్ డమ్ మొత్తం మారిపోయింది. పాన్ ఇండియాలో పెను సంచలనాలను సృష్టిస్తున్నాడు. ‘పుష్ప 2’ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్ల గొట్టిన నటుడు కూడా తనే కావడం విశేషం…ఇక రాజమౌళి సృష్టించిన ‘బాహుబలి 2’ సినిమా రికార్డు సైతం పుష్ప 2 సినిమాతో బ్రేక్ చేసిన నటుడిగా చాలా మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నాడు… కెరియర్ స్టార్టింగ్ లో ఆయన సినిమాలను ఎంచుకునేటప్పుడు తన పక్కన కొంతమంది తన ఫ్రెండ్స్ ను అయితే పెట్టుకునేవాడట. తనతో పాటు ఫ్రెండ్స్ కూడా ఆ కథలను వినేవారు. వాళ్ళ జడ్జిమెంట్స్ తెలుసుకున్న తర్వాత ఆయన సినిమాలకు కమిట్ అవుతూ ఉండేవాడట. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన ఫ్రెండ్స్ కొన్ని స్క్రిప్ట్ లను అతని నుంచి నుంచి దూరం చేశారట. ఇక అవి వేరే హీరోలు చేసి సూపర్ సక్సెస్ లను సాధించడంతో అల్లు అర్జున్ రియలైజ్ అయి తన ఫ్రెండ్స్ కి కథలను వినిపించకుండా తను మాత్రమే వింటూ తానొక్కడే జడ్జిమెంట్ అయితే తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక అప్పటినుంచి తను మంచి సినిమాలను ఎంచుకుంటున్నాడట. అంటే ఫ్రెండ్స్ అనే వీక్ నెస్ ఉండడం వల్లే తన ఫ్రెండ్స్ కి తను దూరం కాలేకపోయాడట. వాళ్లకి సినిమాలను జడ్జ్ చేసే కెపాసిటీ లేకపోవడం వల్లే ఆయన వాళ్ళను పక్కన పెట్టి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఆయన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ వల్లే ఆయన చాలా తొందరగా ఇండస్ట్రీ హిట్ల ను మాత్రం సాధించలేకపోయారట. లేకపోతే ఆయన ఓన్ జడ్జిమెంట్ కనక తీసుకొని ఉంటే ఎప్పుడో ఇండస్ట్రీ హిట్ నమోదు చేసే సినిమాలను చేసేవాడని పలువురు అల్లు అర్జున్ సన్నిహితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉండడం విశేషం…
ఇక ఇప్పటివరకు అల్లు అర్జున్ చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టాయి. ఇక వరుసగా అలా వైకుంఠపురంలో, పుష్ప, పుష్ప 2 సినిమాలతో పెను ప్రభంజనాన్ని సృష్టించిన ఆయన అట్లీతో చేయబోతున్న సినిమాతో మరోసారి తానును తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్న అయితే చేస్తున్నాడు…
ఇక ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి సపరేట్ అయిపోయిన అల్లు అర్జున్ అల్లు ఆర్మీ అంటూ తన ఫాలోయింగ్ ను పెంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు… పాన్ ఇండియాలో పలు రికార్డులను సాధించిన హీరోల్లో తను కూడా ఒకడిగా నిలిచాడు.
అలాగే బాలీవుడ్ ప్రేక్షకుల్లో తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి క్రియేట్ అవ్వడంతో ఆయన మెగా ఫ్యామిలీ కాంపౌండ్ ను సైతం తర్వాత టచ్ చేయడం లేదు. ఇప్పటి వరకు ఒకే కానీ సోలో హీరోగా ఉంటూ ఎన్ని సంవత్సరాల పాటు సక్సెస్ లను సాధిస్తాడు. మెగా హీరోల సపోర్ట్ లేకుండా తన ఒంటరిగా ఎదిగి మెగా ఫ్యామిలీ హీరోల కంటే గొప్ప స్టార్ డమ్ ను సంపాదించుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…