https://oktelugu.com/

Allu Arjun : అల్లు అర్జున్ అభిమానులకు చేదు వార్త..ఇప్పట్లో ఇక లేనట్టే..సంచలన అప్డేట్ ఇచ్చిన నిర్మాత!

Allu Arjun : 'పుష్ప 2'(Pushpa 2 Movie) తో పాన్ ఇండియన్ లెవెల్లో బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించి మన తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) తదుపరి చిత్రం ఏమిటి అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో నడుస్తున్న చర్చ.

Written By: , Updated On : March 1, 2025 / 09:15 AM IST
Allu Arjun

Allu Arjun

Follow us on

Allu Arjun : ‘పుష్ప 2′(Pushpa 2 Movie) తో పాన్ ఇండియన్ లెవెల్లో బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించి మన తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) తదుపరి చిత్రం ఏమిటి అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో నడుస్తున్న చర్చ. త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) తో వెంటనే అల్లు అర్జున్ తదుపరి చిత్రం ఉంటుందని అన్నారు, కొంతమంది త్రివిక్రమ్ సినిమా కంటే ముందు తమిళ దర్శకుడు అట్లీ తో తీస్తాడని అన్నారు, కానీ ఏది అధికారికంగా ఖరారు కాలేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ విదేశాల్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. గత రెండు మూడు నెలల్లో ఆయన ఎదురుకున్న మానసిక, శారీరక ఒత్తిడి ఎలాంటిదో మనమంతా చూస్తూనే ఉన్నాం. వాటి నుండి పూర్తి స్థాయిలో ఉపశమనం పొందేందుకే ఆయన విదేశాలకు పయనమయ్యాడు. అయితే త్రివిక్రమ్ సినిమాకి సంబంధించి లుక్ టెస్ట్ జరిగిందని, ఉగాది నుండి సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని ఒక ప్రచారం గట్టిగా జరిగింది.

Also Read : దిల్ రాజు కి అల్లు అర్జున్ బంపర్ ఆఫర్..ఇలాంటి ఛాన్స్ ఏ నిర్మాతకు రాదేమో..ఎందుకు ఇంత స్పెషల్ ట్రీట్మెంట్?

ఈ ప్రచారాలపై ఆ చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ(Naga Vamsi) స్పందించాడు. ఆయన నిర్మాతగా వ్యవహరించిన లేటెస్ట్ చిత్రం ‘మ్యాడ్ 2′(Mad Square) మార్చి 29వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ ని నిన్న సాయంత్రం ఏర్పాటు చేసారు. ప్రెస్ మీట్ లో ఒక విలేఖరి అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా వచ్చే నెలలో ప్రారంభం అవ్వబోతుంది అనే టాక్ ఉంది. దీనిపై క్లారిటీ ఇస్తారా అని అడగగా, దానికి ఆయన సమాధానం చెప్తూ ‘ఇప్పట్లో షూటింగ్ మొదలయ్యే అవకాశాలు లేవు. ఏది జరిగిన ఈ ఏడాది ద్వితీయార్థం లోనే జరుగుతుంది’ అని చెప్పుకొచ్చాడు. దీంతో ఉగాదికి సినిమా మొదలు అవుతుంది అంటూ ఆశతో ఎదురు చూసిన అభిమానులకు నిరాశ ఎదురైంది. అయితే అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా చాలా పెద్దది.

పాన్ ఇండియా లెవెల్ లో ప్రకంపనలు పుట్టించే స్టోరీ లైన్ తో ఈ సినిమా రాబోతుంది. మన పురాణాల గురించి తీసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ సృష్టించాయో మనమంతా చూసాము. ఈ క్రేజీ కాంబినేషన్ నుండి రాబోతున్న సినిమా కూడా ఆ జానర్ కి సంబంధించినదే. శివ పార్వతుల తనయుడు కార్తికేయ జీవితం లోని ఒక ముఖ్యమైన ఘట్టాన్ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కి పురాణాల్లో ఎలాంటి పట్టు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన వాటి గురించి మాట్లాడుతుంటే అలా ఎన్ని గంటలైనా వింటూ ఉండిపోతాము. అంత అద్భుతంగా న్యారేట్ చేయగలడు. ఇప్పటి వరకు కేవలం ఫ్యామిలీ డ్రామాలు, ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తూ వచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్, మొట్టమొదటిసారి తనకు ఎంతో పట్టు ఉన్నటువంటి సబ్జెక్టు మీద సినిమా చేస్తున్నాడు, ఇక బాక్స్ ఆఫీస్ వసూళ్లు ఆకాశమే హద్దు అనే రేంజ్ లో ఉంటాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Also Read : అల్లు అర్జున్ సినిమాని బ్యాన్ చేసిన నెట్ ఫ్లిక్స్ సంస్థ..ఇక ఎప్పటికీ చూడలేమా..? కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!