https://oktelugu.com/

Allu Arjun : అల్లు అర్జున్ సినిమాలు సెట్స్ మీదకి వెళ్ళడానికి ఎందుకు లేట్ అవుతుంది… దానికి అసలు కారణాలు ఏంటి..?

Allu Arjun : 'పుష్ప 2' సినిమాతో 1870 కోట్ల కలెక్షన్స్ ను వసూల్ చేసిన అల్లు అర్జున్... ప్రస్తుతం భారీ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే ఇద్దరు స్టార్ డైరెక్టర్లతో సినిమాలు కమిట్ ఆయన అందులో ఏ సినిమాను మొదట స్టార్ట్ చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాల బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతుండటం విశేషం...

Written By: , Updated On : February 24, 2025 / 01:41 PM IST
Allu Arjun

Allu Arjun

Follow us on

Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంప్రదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే… ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ (Allu Arjun) మరిన్ని విజయాలను అందుకోవాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఒకెత్తయితే ఇక మీదట చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ (Truvukram) డైరెక్షన్ లో మైథలాజికల్ సినిమాను చేయడానికి సిద్ధమయ్యాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇంతకుముందు అట్లీ (Atlee) డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలైతే వచ్చాయి. ఇక అనుకోకుండా ఆ సినిమా ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చే సినిమా కంటే ముందే ఈ సినిమాని తెరకెక్కించాలనే ఉద్దేశ్యంలో సినిమా మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకి 300 కోట్ల తీసుకున్నాడు. ఇక ఈ సినిమాకి 350 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. పాన్ ఇండియా డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న అట్లీ ప్రస్తుతం దానికి తగ్గ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.

మరి వీళ్ళిద్దరు కలిపి 450 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటే బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇక మిగిలిన ఆర్టిస్టులందరికి కలిపి మరో వంద కోట్ల వరకు బడ్జెట్ అయిన కూడా 500 కోట్లకు పైన వీళ్ళ రెమ్యూనిషన్ లకే వెళ్లిపోతున్నాయి. ఇక సినిమాని మహా అయితే రెండు మూడు వందల కోట్లలో తీసినా కూడా బడ్జెట్ ని 800 కోట్లు దాటిపోతుంది.

దీని ద్వారా సినిమాలు చాలా వరకు లేట్ అవుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే అట్లీ లాంటి స్టార్ డైరెక్టర్ అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో తో సినిమాని చేయాలని చూస్తున్నారు.మరి అల్లు అరవింద్ ఇంత భారీ బడ్జెట్ ని భరించడానికి తను మరో ప్రొడ్యూసర్ ను కూడా తెచ్చుకునే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

మరి ఈ రేంజ్ లో బడ్జెట్ పెరిగిపోవడం వల్ల సినిమా తేడా కొడితే మాత్రం భారీ నష్టాలను మిగిల్చే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఆచితూచి మరి ప్రొడ్యూసర్లు అడిగేయాల్సిన అవసరమైతే ఉంది. బడ్జెట్ ప్రాబ్లం వల్లే సినిమాలు స్టార్ట్ అవ్వడం లేట్ అవుతుందనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది.