Allu Arjun and Atlee : తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే మనకు స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు ఇక్కడున్న చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అవుతూ వస్తున్నారు. ఇప్పటివరకు వాళ్ళు సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇక మీదట రాబోయే సినిమాలతో భారీ విజయాలను అందుకొని ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు…
ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ మంచి గుర్తింపైతే దక్కుతుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ (Allu Arjun) లాంటి స్టార్ హీరో తెలుగులోనే కాకుండా పాన్ ఇండియాలో కూడా భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నాడు. పుష్ప 2 (Pushpa 2) సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టిన ఈయన ప్రస్తుతం అట్లీ (Atlee) డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే ఏప్రిల్ 8 వ తేదీన ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమాతో అల్లు అర్జున్ మరోసారి భారీ ఇండస్ట్రీ హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే తర్వాత సినిమాలతో కూడా భారీ విజయాలను అందుకుంటే ఆయన ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా మారతాడు. మరి ఇప్పటివరకు అల్లు అర్జున్ చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇప్పటివరకు ఏ హీరోకి సాధ్యం కానీ రీతిలో పాన్ ఇండియాలో పెను రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతున్న ఈ స్టార్ హీరో తొందర్లోనే సూపర్ సక్సెస్ లను సాధించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్ గా ముదురు భామ..మండిపడుతున్న ఫ్యాన్స్!
మరి తను అనుకున్నట్టుగానే రాబోయే సినిమాలతో ఎలాంటి విజయాలను సాధిస్తాడు తద్వారా ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అయితే త్రివిక్రమ్ తో చేయాలనుకున్న సినిమాని పక్కన పెట్టి మరి అట్లీతో సినిమా చేయడానికి గల కారణం ఏంటి అంటే అట్లీ చెప్పిన కథ పాన్ ఇండియాని కవర్ చేసే కథగా ఉందట.
అందువల్లే ఆయనతో సినిమా చేయడానికి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఇంతకుముందు అట్లీ షారుక్ ఖాన్ తో చేసిన జవాన్ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడంతో ఆయనకు పాన్ ఇండియాలో మార్కెట్ కూడా భారీగా ఉండడంతో ఈయనతో సినిమా చేస్తే ఈజీగా ప్రేక్షకులందరికి రీచ్ అవుతుంది.
తద్వారా పాన్ ఇండియాలో మరోసారి పెను రికార్డులను క్రియేట్ చేయొచ్చనే ఉద్దేశ్యంతోనే అల్లు అర్జున్ ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది… మరి తను అనుకున్నట్టుగానే భారీ విజయాలను అందుకుంటు ముందుకు సాగుతాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read : అల్లు అర్జున్ నెంబర్ వన్ హీరో అవ్వాలంటే ఇదొక్కటే దారి…