Allu Arjun : ఒకప్పుడు టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ చాలా కామన్ గా ఉండేవి. ఒకే స్థాయి ఇమేజి ఉన్న హీరోలు అప్పట్లో నెలకు ఒక సినిమాని కలిసి చేసేవారు. అయితే చిరంజీవి యుగం మొదలయ్యాక మల్టీస్టారర్ ట్రెండ్ కనుమరుగు అయిపోయింది. అలా కనుమరుగైన ట్రెండ్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో మళ్ళీ మొదలైంది. మహేష్ బాబు(Superstar Mahesh Babu) ఆ తర్వాత మల్టీస్టారర్(Victory Venkatesh) చిత్రాలు చేయలేదు కానీ, వెంకటేష్ మాత్రం బాగా ఆ ట్రెండ్ ని కొనసాగించాడు. ఇక #RRR చిత్రం తో అయితే ఈ ట్రెండ్ తారా స్థాయికి చేరుకుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి ఊర మాస్ హీరోలు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో అని అప్పట్లో అభిమానులు ఊహించుకునేవాళ్ళు. ఆ ఊహలను నిజం చేస్తూ రాజమౌళి ఈ సినిమాని వెండితెర పైకి తీసుకొని రావడం, అది సక్సెస్ అయ్యి ఆస్కార్ అవార్డ్స్ ని కూడా తెచ్చిపెట్టడం వంటివి భవిష్యత్తులో మల్టీస్టారర్ ట్రెండ్ కి కొత్త ఊపిరిని పోశాయి.
Also Read : ‘హరి హర వీరమల్లు’ సెన్సార్ డేట్ వచ్చేసింది..ఇక విడుదల లాంఛనమే!
ఇప్పుడు త్వరలో జూనియర్ ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వార్ 2′(War 2 Movie) మూవీ రానుంది. ఈ సినిమా పై కూడా అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే భవిష్యత్తులో ఎన్నో మల్టీస్టారర్ సినిమాలు మన ముందుకు రాబోతున్నాయి. అయితే సోషల్ మీడియా లో గత రెండు మూడు రోజులుగా అల్లు అర్జున్(Icon Star Allu Arjun), రణబీర్ కపూర్(Ranbir Kapoor) కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది అంటూ ఒక వార్త తెగ ప్రచారం అవుతుంది. ఇద్దరు హీరోలు కూడా అందుకు ఒప్పుకున్నారని, బాలీవుడ్ లో ఎన్నో చారిత్రాత్మిక సినిమాలను అందించిన సంజయ్ లీలా భన్సాలీ(Sanjay Leela Bhansali) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని తెలుస్తుంది. ఇప్పటికే స్టోరీ సిట్టింగ్స్ లో అల్లు అర్జున్, రణబీర్ కపూర్ ఇద్దరు కూడా పాల్గొన్నారట.
ఇద్దరికే కథ నచ్చడంతో రాబోయే రెండేళ్లలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. పాన్ ఇండియా లెవెల్ లో నేటి తరం సూపర్ స్టార్స్ లో నటన పరంగా ఎవరెస్ట్ రేంజ్ ని చూపించిన హీరోలు అల్లు అర్జున్, రణబీర్ కపూర్. వీళ్ళిద్దరిని వేర్వేరు సినిమాల్లో చూడడానికే రెండు కళ్ళు సరిపోవు, అలాంటిది ఇద్దరూ కలిసి మల్టీస్టార్రర్ చేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో, బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలు క్రియేట్ అవుతాయో, ఊహించడానికి కూడా కష్టమే. కొసమెరుపు ఏమిటంటే ఈ చిత్రం లో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. హిస్టారికల్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా బాజీ రావు మస్తానీ, పద్మావత్ తరహా లో ఉంటుందని సమాచారం. హాలీవుడ్ చిత్రం ‘ట్రాయ్’ ని కూడా పోలి ఉంటుందట. చూడాలి మరి ఈ చిత్రం కార్య రూపం దాలుస్తుందా లేదా అనేది.