Allu Arjun : పుష్ప 2′(Pushpa 2 Movie) వంటి సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) అట్లీ(Atlee) తో ఒక సినిమా చేయబోతున్నాడు అనేది దాదాపుగా ఖరారు అయిపోయినట్టే. త్రివిక్రమ్(Trivikram Srinivas) తో చేయబోయే సినిమా కొన్ని నెలలు వాయిదా పడనుంది. అయితే నిర్మాత నాగవంశీ రీసెంట్ గా మాట్లాడిన మాటలను చూస్తుంటే, అల్లు అర్జున్ ‘అట్లీ’, త్రివిక్రమ్ సినిమాల షూటింగ్స్ ని సమాంతరంగా చేస్తాడని, ఈమేరకు ఆయన నిర్ణయం కూడా తీసుకున్నాడని అంటున్నారు. అయితే త్రివిక్రమ్ సినిమాకంటే ముందుగా అట్లీ చిత్రమే మొదలు కాబోతుంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో గడిచిన కొంత కాలం నుండి ఎన్నో గాసిప్స్ విన్నాము. ఇందులో సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth), శివ కార్తికేయన్(Sivakarthikeyan) వంటి వారు నటిస్తున్నట్టు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు వాటి గురించి ఎవ్వరూ మాట్లాడుకోవట్లేదు.
Also Read : అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ కి ముహూర్తం ఫిక్స్ అయిందా..?
ఇక రీసెంట్ గా ఈ సినిమా గురించి జరుగుతున్న ప్రచారం ఏమిటంటే ఇందులో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని, ఒక పాత్ర హీరో క్యారక్టర్ కాగా, మరో పాత్ర విలన్ క్యారక్టర్ అని సోషల్ మీడియా లో ఈ వార్త చక్కర్లు కొట్టింది. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియదు కానీ, ఒకవేళ అల్లు అర్జున్ ఒప్పుకొని చేస్తే మాత్రం వేరే లెవెల్ బాక్స్ ఆఫీస్ విద్వంసం ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో హీరోయిన్ క్యారక్టర్ గురించి ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద చర్చ నడుస్తుంది. బాలీవుడ్ నుండి హాలీవుడ్ కి వెళ్లి, అక్కడ స్టార్ గా ఎదిగిన ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించబోతుందని టాక్. ఈ వార్తపై అల్లు అర్జున్ అభిమానులు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే తక్షణమే నిర్ణయం మార్చుకోవాల్సిందిగా మూవీ టీం ని డిమాండ్ చేస్తున్నారు.
వయస్సు విషయంలో అల్లు అర్జున్, ప్రియాంక చోప్రా సమానమే. కానీ అల్లు అర్జున్ లుక్స్ ప్రస్తుతం 30 ఏళ్ళ కుర్రాడి లాగా ఉన్నాయి. ప్రియాంక చోప్రా లుక్స్ ఆ రేంజ్ లో లేవు. అల్లు అర్జున్ పక్కన ఆమె ఏమాత్రం సరిపోదని, సినిమా ఫలితం తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొంతమంది మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు. ప్రియాంక చోప్రా ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబు మూవీ లో నటిస్తుంది. రాజమౌళి తో సినిమా అంటే కనీసం రెండేళ్ల వరకు మరో సినిమాలో నటించకూడదు అనే నియమం ఉంటుంది, రీసెంట్ గా ఆ మూవీ టీం ప్లాన్ చేస్తున్న ప్రతీ షెడ్యూల్ లో ప్రియాంక చోప్రా పాల్గొంటూ ఫుల్ బిజీ గా ఉంటుంది., ఆమె మన సినిమాలో హీరోయిన్ అయ్యే అవకాశమే లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే రాజమౌళి షరతులు పాన్ వరల్డ్ స్టార్ అయినటువంటి ప్రియాంక చోప్రా కి కూడా వర్తిస్తాయా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read : పాన్ వరల్డ్ షేక్ అయ్యే మల్టీస్టారర్ ని ఫిక్స్ చేసిన అల్లు అర్జున్!