Homeఎంటర్టైన్మెంట్Allu Arjun: బన్నీ నుంచి క్రేజీ అనౌన్స్​మెంట్​​.. తర్వాత సినిమా గురించేనా?

Allu Arjun: బన్నీ నుంచి క్రేజీ అనౌన్స్​మెంట్​​.. తర్వాత సినిమా గురించేనా?

Allu Arjun: ఐకాన్​స్టార్​ అల్లుఅర్జున్​హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సినిమా పుష్ప. ఇటీవలే షూటింగ్​ పూర్తి చేసుకి.. ప్రమోషన్స్లో ఫుల్​ బిజిగా ఉన్నాడు బన్నీ. అయితే, తాజాగా మరో షాకింగ్​ అప్​డేట్​ రానున్నట్లు సమాచారం. అల్లు అర్జున్​ అభిమానులందరినీ ఆశ్చర్యపరిచేలా ఓ బిగ్​ అనౌన్స్​మెంట్​ చేయనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే, ఇది సినిమాకు సంబంధించింది కాదట.

allu arjun pushpa movie

సినిమా కానప్పుడు మరి ఇంకేమైంటుందబ్బా అని అభిమానులు ఆసక్తిగా చర్చిస్తున్నారు.  ఈ క్రమంలోనే ఏదైనా ఓటీటీకి సంబంధించి కానీ, లేదా స్పెషల్​కా వర్క్ చేస్తున్న ప్రాజెక్టు విషయంలో కానీ అయ్యిండొచ్చని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. మరి ఈ విషయంపై క్లారిటీ రావాలంటే.. బన్నీ అనౌన్స్​మెంట్​ వచ్చే వరకు వేచిచూడాల్సిందే.

మరోవైపు పుష్ప ప్రమోషన్స్​తో ఫుల్​ బిజీగా ఉన్నారు బన్నీ. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్నసంగతి తెలిసిందే.. ఇందులో రష్మికా హీరోయిన్​గా నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో ఫహద్ ఫాసిల్​, సునీల్​ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు అనసూయ కూడా మాస్​ క్యారెక్టర్​లో దర్శనమివ్వనుంది. ఈ ఏడాది డిసెంబరు 17న ఐదు భాషల్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. ఈ సినిమాతోనే బన్నీ బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

ఇప్పటికే అన్ని భాషల్లో డిస్ట్రిబ్యూటర్స్ కూడా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఈ4 ఎంటర్​టైన్మెంట్ సంస్థ మలయాళంలో, తమిళంలో లైకా ప్రొడభన్స్​, కన్నడలో స్వాగత్​ ఎంటర్​ప్రైజెస్​, ఎవర్సీస్​లో హంసినీ ఇంలా అన్ని చోట్ల పుష్పను విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version