Akhanda Movie: నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా సినిమా ‘అఖండ’. ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాల తర్వాత బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన సినిమా ఇది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా చేస్తుంది. ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ రోల్ పోషించారు. జగపతి బాబు, పూర్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. కాగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 27న హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

Also Read: అఖండ ప్రీ రిలీజ్ వేడుకలో మార్పులు.. వాతావరణ మార్పులే కారణమా?
కాగా ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరు కాబోతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫంక్షన్ కు ముందుగా ఎన్టీఆర్ తో పాటు నేచురల్ స్టార్ నాని అతిధులుగా హాజరవుతారని అందరూ భావించారు. గతంలో బోయపాటి శ్రీనుతో అల్లు అర్జున్ సరైనోడు సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇటీవలే సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ సినిమా అంటే ప్రేక్షకుల్లో కొన్ని అంచనాలు ఉంటాయి. సెన్సార్ రిపోర్ట్ కూడా బావుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. కాగ అఖండ సినిమాను థీయేటర్లలో డిసెంబర్ 2 న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
Its going to be a 💥 𝐌𝐀𝐒𝐒ive Explosion Event 💣
🔥 Icon Star @alluarjun a.k.a #Pushpa meets #Akhanda at Pre-Release Roar 🦁💥
📍Shilpakala Vedika | 27th Nov @ 6:30PM#AkhandaRoaringFrom2ndDec#NandamuriBalakrishna #BoyapatiSreenu @ItsMePragya @IamJagguBhai @actorsrikanth pic.twitter.com/Wv39bZqCwo
— Dwaraka Creations (@dwarakacreation) November 25, 2021
Also Read: ‘అఖండ’ సినిమా రన్ టైం ఎంతో తెలుసా?