Jagan Sarkar: జగన్ సర్కార్: ఏకపక్ష నిర్ణయాలు.. ఎదురుదెబ్బలు

Jagan Sarkar: ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన ముందుకు సాగడం లేదు. ఇష్టానుసారం జీవోలు ఇవ్వడం మళ్లీ వెనక్కి తీసుకోవడం వంటి చర్యలతో ప్రజల్లో చులకన అవుతోంది. ఇప్పటి వరకు ఎన్ని జీవోలు తెచ్చినా అన్ని కోర్టులో వీగిపోతుండటం తెలిసిందే. అంటే ప్రభుత్వ తీరు ఎలా ఉందో అర్థమైపోతోంది. ప్రజా సంక్షేమం కోసం పాటుపడాల్సిన ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలతో దెబ్బతింటోంది. మొండిగా ముందుకెళ్తే చీవాట్లు తింటూ వెనకకు రావడం అలవాటుగా మారింది. దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో మరింత అసహ్యం […]

Written By: Srinivas, Updated On : November 26, 2021 11:26 am
Follow us on

Jagan Sarkar: ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన ముందుకు సాగడం లేదు. ఇష్టానుసారం జీవోలు ఇవ్వడం మళ్లీ వెనక్కి తీసుకోవడం వంటి చర్యలతో ప్రజల్లో చులకన అవుతోంది. ఇప్పటి వరకు ఎన్ని జీవోలు తెచ్చినా అన్ని కోర్టులో వీగిపోతుండటం తెలిసిందే. అంటే ప్రభుత్వ తీరు ఎలా ఉందో అర్థమైపోతోంది. ప్రజా సంక్షేమం కోసం పాటుపడాల్సిన ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలతో దెబ్బతింటోంది. మొండిగా ముందుకెళ్తే చీవాట్లు తింటూ వెనకకు రావడం అలవాటుగా మారింది. దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో మరింత అసహ్యం పెరిగిపోతోంది.

Jagan Sarkar

ఇప్పటికే మూడు రాజధానుల వ్యవహారంలో ఇరకాటంలో పడినా ఇంతకు ముందు కూడా తెచ్చిన జీవోలన్నీ రద్దు కావడంతో ప్రభుత్వంపై మచ్చ పెద్దదవుతోంది. రాష్ర్ట మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ మూడు రాజధానుల బిల్లు మళ్లీ తెస్తామని చెప్పపడం తెలిసిందే. దీంతో జగన్ మదిలో ఏముందే ఎవరికి అర్థం కావడం లేదు. ప్రభుత్వానికి నీతి నిజాయితీ కరువవుతోంది.

మరోవైపు శాసనమండలి రద్దుకు మొదట అంగీకరించి ఇప్పుడు ఆ ప్రతిపాదన వెనక్కి తీసుకోవడంతో కూడా అభాసుపాలవుతోంది. రాష్ర్టంలో పరిపాలనలో ఎటు వైపు వెళ్తుందో అనే అనుమానాలు అంరదిలో వ్యక్తమవుతున్నాయి. గతంలో శాసనమండలి రద్దు సమయంలో అందరు చెప్పినా వినిపించుకోకుండా ఏకపక్ష నిర్ణయంతో మండలి రద్దుకు ఆమోదం తెలిపి మరోమారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏర్పడింది.

రెండున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ప్రజల్లో పట్టు కోల్పోతోంది. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. ఏది జరిగినా తమకు సంబంధం లేదని ఎదుటి వారిపై రుద్దడమే ధ్యేయంగా పెట్టుకుంది. ఏ విమర్శ వచ్చినా అది చంద్రబాబు వల్లే అంటూ నిందించడమే కారణంగా చూపుతోంది.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో అన్నింట్లో వ్యతిరేకతే వస్తోంది. రాజ్యాంగాన్నే అవమానిస్తూ పలు కీలక నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకుంటూ కోర్టులో మొట్టికాయలు వేయించుకుంటోంది. ప్రభుత్వం ఎన్ని జీవోలు తెచ్చినా అవి కోర్టుల్లో వీగిపోవడం తెలిసిందే. కానీ ప్రభుత్వంలో మాత్రం న్యాయవ్యవస్థపై నమ్మకం మాత్రం కలగడం లేదు.

Also Read: Chandrababu strategy: చంద్రబాబుకు ‘రూట్’ దొరికింది..! వ్యూహంలో మార్పు.. ఇక ప్లాన్ బి

ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి తీసుకుంటూ వారిని సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలుస్తోంది. టీడీపీ నుంచి పలువురిని తమ పార్టీలోకి తీసుకుని తరువాత పట్టించుకోకపోవడంతో వారి పరిస్థితి అధ్వానంగా మారుతోంది. ఏం చేసినా చెల్లుతుందనే ఉద్దేశంతోనే అధికార పార్టీ తన కుట్రలతో పాలన సాగిస్తోంది. ఇందులో భాగంగా చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండటం లేదు.

జగన్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలతో వ్యవస్థపైనే అసహ్యం కలుగుతోంది. ముఖ్యమంత్రిగా ఉన్నా నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం ఒంటెద్దు పోకడలతో ఇబ్బందుల పాలువుతున్నట్లు తెలుస్తోంది. ప్రజలకు మేలు చేయాల్సిన నాయకుడే వారికి కీడు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో జగన్ కు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు.

Also Read: Chandrababu Naidu Jr NTR: బాబూ… ఎన్టీఆర్ కి క్షమాపణలు చెప్పు… నేషనల్ వైడ్ ఇదే హాట్ టాపిక్

Tags