https://oktelugu.com/

అవిటివాడిగా నారా రోహిత్ !

నారా రోహిత్ కి స్టార్ డమ్ రాలేదు గాని, వైవిధ్యమైన కథానాయకుడు అనే గుర్తింపు మాత్రం వచ్చింది. ఆ మాటకొస్తే తెలుగు హీరోలందరిలో కల్లా మొదటి నుండి వైవిధ్యమైన పాత్రలను కథలను చేస్తూ వస్తోన్న హీరో బహుశా నారా రోహిత్ ఒక్కడే అనుకుంటా. ఒకపక్క హీరోగా చేస్తూనే.. మరోపక్క ‘అప్పట్లో ఒక్కడుండే వాడు, సారొచ్చారు, నీది నాది ఒకే కథ లాంటి ఐదారు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించాడు. తన సినిమాలకు కనీస మార్కెట్ ఉన్నా.. ఎప్పుడూ […]

Written By:
  • admin
  • , Updated On : August 28, 2020 / 05:24 PM IST
    Follow us on


    నారా రోహిత్ కి స్టార్ డమ్ రాలేదు గాని, వైవిధ్యమైన కథానాయకుడు అనే గుర్తింపు మాత్రం వచ్చింది. ఆ మాటకొస్తే తెలుగు హీరోలందరిలో కల్లా మొదటి నుండి వైవిధ్యమైన పాత్రలను కథలను చేస్తూ వస్తోన్న హీరో బహుశా నారా రోహిత్ ఒక్కడే అనుకుంటా. ఒకపక్క హీరోగా చేస్తూనే.. మరోపక్క ‘అప్పట్లో ఒక్కడుండే వాడు, సారొచ్చారు, నీది నాది ఒకే కథ లాంటి ఐదారు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించాడు. తన సినిమాలకు కనీస మార్కెట్ ఉన్నా.. ఎప్పుడూ బడ్జెట్ ను ఓవర్ కాకుండా తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేస్తూ.. తనకంటూ ఓ ఇమేజ్ సాధించిన ఘనత నారా రోహిత్ ది. పైగా పాతికేళ్ల వయసులోనే నలభై ఏళ్ల వ్యక్తిగా కూడా కొన్ని సినిమాల్లో కనిపించే ధైర్యం చేశాడు.

    Also Read: ఓటీటీలు సినీ ఇండస్ట్రీకి లాభమా? నష్టమా?

    అయితే, పాపం టాలెంట్ ఎంత ఉన్నా.. ఎన్ని మంచి సినిమాలు చేసినా కనీసం సెకెండ్ గ్రేడ్ స్టార్ ల వరుసలో కూడా నారా రోహిత్ నిలబడలేకపోయాడు. దానికి తోడు నారా రోహిత్ కి సాలిడ్ హిట్ వచ్చి చాలా కాలం అయిపోయింది. పైగా సినిమాలను కూడా బాగా తగ్గించేశాడు. చేసిన గత కొన్ని సినిమాలు కూడా భారీ ప్లాప్ లు అయ్యాయి. ఇలా ప్రస్తుతం నారా రోహిత్ వరుస ప్లాప్ లతో బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టలేక, సినిమాల వేగాన్ని కూడా పెంచలేక సతమతమవుతున్నాడు. అయినా నారా రోహిత్ మాత్రం మరో ప్రయోగానికి సిద్ధం అయ్యాడు. బాణం లాంటి వినూత్నమైన చిత్రంతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమైన చెైతన్య దంతులూరి దర్శకత్వంలో నారా రోహిత్ మారో వైవిధ్యమైన సినిమా చేయబోతున్నాడు.

    Also Read: మళ్లీ సౌత్‌పై కన్నేసిన తాప్సీ

    కరోనా పరిస్థితులు పోయాక ఈ సినిమాని మొదలు పెట్టనున్నారు. అయితే ఈ సినిమా కథ ఒక అవిటివాడు జీవితానికి సంబంధించినది అని, సినిమాలో నారా రోహిత్ అవిటివాడిగా కనిపించబోతున్నాడు అని తెలుస్తోంది. ఇలాంటి కొత్త కథలను ఎన్నుకోవడం అంటే.. అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. నారా రోహిత్ ది ఈ విషయంలో నిజంగా డేరింగే. తెలుగు యంగ్ హీరోల్లో ఈ జనరేషన్ లో ఏ హీరో చేయలేని కథను నారా రోహిత్ లైన్ లో పెట్టాడు. ఇక దర్శకుడిగా తన మొదటి చిత్రమైన ‘బాణం’తో చెైతన్యకు మంచి పేరు వచ్చినా సక్సెస్ మాత్రం రాలేదు. మరి ఈ సారైనా సక్సెస్ కొడతాడేమో చూడాలి.