https://oktelugu.com/

Allu Arjun Shock To Fans: అభిమానులకు ఊహించని షాక్ ఇవ్వబోతున్న అల్లు అర్జున్

Allu Arjun Shock To Fans: మన టాలీవుడ్ లో ప్రస్తుతం ఏ హీరో కూడా ఎంజాయ్ చెయ్యని క్రేజ్ ని చూస్తున్న ఏకైక హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..పుష్ప సినిమా తో ఆయన కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు, బాలీవుడ్ , కోలీవుడ్, మాలీవుడ్ అని తేడా లేకుండా ప్రతి చోట తన జెండాని పాతేసాడు..బాహుబలి పార్ట్ 2 మరియు KGF చాప్టర్ 2 తర్వాత అదే స్థాయిలో యావత్తు భారతదేశం మొత్తం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 30, 2022 / 03:42 PM IST

    Allu Arjun Shock To Fans

    Follow us on

    Allu Arjun Shock To Fans: మన టాలీవుడ్ లో ప్రస్తుతం ఏ హీరో కూడా ఎంజాయ్ చెయ్యని క్రేజ్ ని చూస్తున్న ఏకైక హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..పుష్ప సినిమా తో ఆయన కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు, బాలీవుడ్ , కోలీవుడ్, మాలీవుడ్ అని తేడా లేకుండా ప్రతి చోట తన జెండాని పాతేసాడు..బాహుబలి పార్ట్ 2 మరియు KGF చాప్టర్ 2 తర్వాత అదే స్థాయిలో యావత్తు భారతదేశం మొత్తం ఇప్పుడు పుష్ప పార్ట్ 2 కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది..ఈ సినిమా తో అల్లు అర్జున్ కూడా చాలా తేలికగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చేరిపోతాడు అని అనడం లో ఎలాంటి సందేహం లేదు..సినిమా సినిమాకి తన క్రేజ్ గ్రాఫ్ ని పెంచుకుంటూ పోతున్న అల్లు అర్జున్ తాను భవిష్యత్తులో చెయ్యబోతున్న సినిమాల మీద కూడా ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు..యంగ్ డైరెక్టర్స్ ని ప్రోత్సహించడం లో ఎప్పుడు ముందు ఉండే అల్లు అర్జున్, అప్పట్లో వక్కంతం వంశి ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ అనే సినిమా చేసిన సంగతి మన అందరికి తెలిసిందే.

    Allu Arjun

    అందుకే ఆయన యంగ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ తో చాలా కాలం క్రితం అనుకున్న ‘ఐకాన్’ అనే ప్రాజెక్ట్ ని కూడా రిస్క్ తీసుకోకుండా పక్కన పెట్టేసాడు..అయితే పుష్ప ది రూల్ తర్వాత అల్లు అర్జున్ చెయ్యబోతున్న సినిమా ఏమిటి అనే దానిపై ఇప్పటి వరుకు ఫాన్స్ కి ఎలాంటి క్లారిటీ రాలేదు..సోషల్ మీడియా లో పలు రకాల డైరెక్టర్ల తో చేస్తున్నాడు అని వార్తలు వస్తున్నప్పటికీ కూడా, ఒక్క ప్రాజెక్ట్ కూడా అధికారికంగా ఇప్పటి వరుకు ప్రకటించలేదు..అల్లు అర్జున్ తోటి హీరోలు అయినా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వంటి వారు క్రేజీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ చేస్తూ అభిమానులను ఖుషి చేస్తుంటే, మా హీరో మాత్రం పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ వచ్చినప్పటికీ కూడా సరిగా ప్లాన్ చేసుకోవడం లేదు అని ఆయన అభిమానులు సోషల్ మీడియా లో కాస్త నిరాశకి గురి అయ్యారు..అలా నిరాశకి గురి అయినా అభిమానులకు ఇప్పుడు ఒక్క శుభ వార్త!..అయితే రాబొయ్యే రోజుల్లో అల్లు అర్జున్ అభిమానులకు దిమ్మ తిరిగి పొయ్యే సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.

    Venu Sriram

    Also Read: Heroine Bold Comments: నేను సింగిల్‌ కాదు, మింగిల్‌.. క్రేజీ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్ !

    అదేమిటి అంటే సౌత్ ఇండియా లోనే క్రేజీ పాన్ ఇండియన్ డైరెక్టర్ తో అల్లు అర్జున్ ఇటీవలే స్టోరీ డిస్కషన్స్ లో కూర్చున్నాడు అట..భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయ్యే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే తెలియనున్నాయి..దీనితో పాటు జూనియర్ ఎన్టీఆర్ తో ఒక్క మల్టీస్టార్ర్ర్ సినిమా కూడా చెయ్యబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..ఈ ప్రాజెక్ట్ ని ప్రముఖ బాలీవుడ్ టాప్ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించబోతునట్టు తెలుస్తుంది..ఈ సినిమాలతో పాటు దర్శక ధీరుడు రాజమౌళి తో కూడా అల్లు అర్జున్ ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి..వీటి అన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే తెలియనున్నాయి..ప్రస్తుతం అల్లు అర్జున్ ఫోకస్ మొత్తం పుష్ప పార్ట్ 2 మీదనే ఉంది..ఈ సినిమా షూటింగ్ ఆగష్టు నెల నుండి ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది.

    Bunny, Tarak

    Also Read: Gujarat Titans IPL 2022 Champion: ఐపీఎల్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్.. ఇంత ఈజీగా ఎలా గెలవగలిగింది?

    Recommended Videos:


    Tags