https://oktelugu.com/

Samantha : ట్రీట్మెంట్ కోసం అమెరికాకు సమంత… అందుకు కోట్ల రూపాయలు ఖర్చు!

ఈ రెండు ప్రాజెక్ట్స్ షూటింగ్ కంప్లీట్ చేసి అమెరికా వెళతారట. అక్కడ అనారోగ్య సమస్యలకు చికిత్స తీసుకోనున్నారట. ఈ మేరకు సమాచారం అందుతుంది. ఈ ట్రీట్మెంట్ కోసం దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారని సమాచారం.

Written By:
  • Shiva
  • , Updated On : July 9, 2023 8:49 am
    Follow us on

    Samantha : సమంత ఓ ఏడాది పాటు సినిమాలు బ్రేక్ ఇచ్చారని న్యూస్ టాలీవుడ్ ని ఊపేసింది. ఆమె అధికారిక ప్రకటన చేయకున్నప్పటికీ విశ్వసనీయ సమాచారం అంటున్నారు. ఖుషి, సిటాడెల్ షూటింగ్స్ దాదాపు పూర్తి చేసిన సమంత విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారని వినికిడి. తాజాగా మరో వార్త తెరపైకి వచ్చింది. సమంత లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళుతున్నారట. అక్కడ కొంత కాలం ఉంటారట. మయోసైటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకునేందుకు ఆమె అమెరికా వెళుతున్నారట. 

     
    గత ఏడాది అక్టోబర్ నెలలో సమంత మయోసైటిస్ సోకిన విషయం బయటపెట్టారు. ఇది ప్రాణాంతక వ్యాధి కాదు. అలా అని చిన్న సమస్య కూడా కాదు. నేను పోరాడాల్సి ఉందని సమంత చెప్పుకొచ్చారు. ఈ ప్రకటన తర్వాత సమంత నెలల తరబడి ఇంటికే పరిమితమయ్యారు. నివాసంలోనే చికిత్స తీసుకున్నారని తెలిసింది. శాకుంతలం ప్రమోషన్స్ కోసం సమంత బయటకు వచ్చింది. మీడియా సమావేశాల్లో పూర్తిగా కోలుకోలేదని చెప్పారు. 
     
    నీరసం ఆవహిస్తుంది. కళ్ళు కాంతిని చూడలేకపోతున్నాయని సమంత తనకున్న సమస్యలు బహిరంగంగానే చెప్పారు. అయితే ఆమె కొంత మేర కోలుకున్నారు. ఒప్పుకున్న సిటాడెల్, ఖుషి చిత్రాల షూటింగ్స్ లో పాల్గొన్నారు. తాజాగా ద్రాక్షారామంలో ఖుషి చిత్ర క్లైమాక్స్ చిత్రీకరించారు. దీంతో ఖుషి చిత్రీకరణ పూర్తి అయినట్లు తెలుస్తుంది. సిటాడెల్ షూటింగ్ సైతం చివరి దశలో ఉంది. 
     
    ఈ రెండు ప్రాజెక్ట్స్ షూటింగ్ కంప్లీట్ చేసి అమెరికా వెళతారట. అక్కడ అనారోగ్య సమస్యలకు చికిత్స తీసుకోనున్నారట. ఈ మేరకు సమాచారం అందుతుంది. ఈ ట్రీట్మెంట్ కోసం దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారని సమాచారం. సినిమాల నుండి ఆమె విరామం తీసుకుంటుంది కూడా ఈ కారణంగానే అని తెలుస్తుంది. కాగా సమంత ఓ హాలీవుడ్ చిత్రానికి సైన్ చేసినట్లు ప్రచారం జరిగింది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇక ఖుషి మినహాయిస్తే సమంత చేతిలో మరో తెలుగు మూవీ లేదు. ఖుషి సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఇది రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. విజయ్ దేవరకొండ హీరో. శివ నిర్వాణ దర్శకుడు.