https://oktelugu.com/

Allu Arjun: కుటుంబ సభ్యులతో కలిసి పుష్ప సినిమా చూడబోతున్న అల్లు అర్జున్… ఏ ధియేటర్ లో అంటే ?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం పుష్ప. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కాగా సినిమాకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. మొదటి షో నుంచే సినిమాకు అన్నీ కోట్ల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ లభిస్తుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ పాజిటివ్ బజ్ నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపుగా మూడు వేలకు పైగా థియేటర్లలో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 17, 2021 / 10:27 AM IST
    Follow us on

    Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం పుష్ప. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కాగా సినిమాకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. మొదటి షో నుంచే సినిమాకు అన్నీ కోట్ల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ లభిస్తుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ పాజిటివ్ బజ్ నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపుగా మూడు వేలకు పైగా థియేటర్లలో విడుదలైంది. అయితే అల్లు అర్జున్ మలయాళ ఫ్యాన్స్ కు మాత్రం ఈ మూవీ విషయంలో నిరాశ తప్పలేదు. అక్కడ తమిళ వెర్షన్ లో అయితే రిలీజ్ చేశారు. కానీ మలయాళ వెర్షన్ ను సాంకేతిక సమస్య కారణంగా రేపు విడుదల చేయబోతున్నారు.

    allu arjun going to watch pushpa movie along with his family members

    Also Read: థియేటర్​లో ఫ్యామిలీతో పుష్పరాజ్​ సందడి.. ఎగబడిన అభిమానులు

    ఇక ఏపీ ప్రభుత్వం ఈ సినిమాకు కూడా బెనిఫిట్ షోలకు అనుమతించని కారణంగా ఫ్యాన్స్ కొంచెం నిరాశకు గురయ్యారు. కానీ అన్నిచోట్లా సినిమాకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లోనూ 95-100% టికెట్స్ అమ్ముడైపోయాయని సమాచారం. ఇదిలా ఉండగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఈరోజు ‘పుష్ప’రాజ్ సందడి చేయబోతున్నాడు అని తెలుస్తుంది. ఈ మేరకు బన్నీ ఫ్యామిలీ మొత్తం ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్లో సినిమాను చూడబోతున్నారని సమాచారం. ఈ విషయాన్ని అల్లు అర్జున్ సోషల్ మీడియా మేనేజర్ శరత్ చంద్ర వెల్లడించారు. కాగా ఆర్య, ఆర్య-2 చిత్రాల తర్వాత అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్‌ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో స్టార్‌ హీరోయిన్‌ సమంత స్పెషల్‌ సాంగ్‌లో స్టెప్పులేసింది.

    Also Read: పుష్ప టీమ్​కు ఆర్​ఆర్​ఆర్​ యూనిట్​ స్పెషల్​ విషెస్​.. తగ్గేదెలే అంటూ ట్వీట్