Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలిసారిగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష‍్ప: ది రైజ్’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. కాగా ఆర్య, ఆర్య-2 చిత్రాల తర్వాత అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కాగా నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్‌గా కనిపించగా… రష్మిక మందన్నా పల్లెటూరి యువతి పాత్రలో నటించింది. స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేసింది.
Also Read: థియేటర్లో ఫ్యామిలీతో పుష్పరాజ్ సందడి.. ఎగబడిన అభిమానులు
అయితే విలన్ గా ఎంట్రీ ఇచ్చిన మలయాళ టాలెంటెడ్ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. సునీల్, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, రావు రమేష్, అనసూయ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఫస్ట్ పార్ట్‌ని ‘పుష్ప: ది రైజ్’ పేరుతో విదలైంది. వచ్చే ఏడాది రెండో భాగం రానుంది. అయితే సెకండ్ పార్ట్‌కు ఏ పేరు పెడతారో అని బన్నీ అభిమానులు, సినీ ప్రేక్షకుల్లో ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు పుష్ప సెకండ్ పార్ట్ సినిమా పేరును రివీల్ చేశాడు దర్శకుడు సుకుమార్. రెండో భాగం పేరును “పుష‍్ప: ది రైజ్’ సినిమా చివర్లో చెప్పేశాడు సుక్కు. ఈ సెకండ్ పార్ట్‌కు ‘పుష్ప: ది రూల్’ అని ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ టైటిల్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పుష్ప ది రైజ్‌తోనే మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస‍్తున్న బన్నీ సెకండ్ పార్టులో తన రూలింగ్‌తో మరింత డోస్ పెంచనున్నట్లు తెలుస్తోంది.
Also Read: అల్లు అర్జున్ రీల్ హీరో కాదు, రియల్ హీరో !