Allu Arjun tweet: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి ఒక్కడే మెగాస్టార్. అది చిరంజీవి(Megastar Chiranjeevi) మాత్రమే. చిరంజీవి లాంటి నటుడ్ని మళ్ళీ మనం చూడలేము అనడం లో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఏ ఇండస్ట్రీ లో కూడా ఎంత మంది స్టార్స్ ఉన్నప్పటికీ మెగాస్టార్ ట్యాగ్ జోలికి మాత్రం వెళ్లరు. కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరో ని మెగాస్టార్ అని పిలవడం ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో ఎక్కువగా మొదలు పెట్టారు. అది కూడా టాలీవుడ్ కి కాదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కే మెగాస్టార్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్ పేజెస్ కూడా టాలీవుడ్ మెగాస్టార్ కి ఇండియన్ మెగాస్టార్ అల్లు అర్జున్ అభిమానుల నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్లు వేశారు. దీనిపై మెగా ఫ్యాన్స్ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: చిరంజీవి ఇప్పటికీ రాజకీయ నాయకుడికి వచ్చే పెన్షన్ తీసుకుంటున్నాడా..? నెలకి ఎంత వస్తుందో తెలుసా..?
చిరంజీవి నీడలో పెరుగుతూ ఇండస్ట్రీ కి వచ్చిన అల్లు అర్జున్ ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి ని ఎంతో ఆదరిస్తూ ఉంటాడు. అలాంటి అల్లు అర్జున్ నిన్న కూడా చిరంజీవి పుట్టినరోజున ట్విట్టర్ లో ఒక ట్వీట్ వేస్తూ ‘వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఒకపక్క ఆయన అభిమానులు దేశానికే తమ హీరో మెగాస్టార్ అని చెప్పుకుంటూ తిరుగుతుంటే, అల్లు అర్జున్ మాత్రం దేశానికీ ఒకే ఒక్క మెగాస్టార్ అంటూ ట్వీట్ వేసాడు. ఇది ఆయన అభిమానులకు ఆయనే కౌంటర్ ఇచ్చినట్టుగా మెగా ఫ్యాన్స్ పరిగణించారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని ప్రత్యేకంగా ట్రోల్ చేయాల్సిన అవసరం లేదని, అల్లు అర్జున్ యే వాళ్లకు సరైన సమాధానం చెప్తుంటాడని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగాస్టార్ ట్యాగ్ పై ఆశలు వదులుకుంటే మంచిది అంటూ వార్నింగ్ ఇస్తున్నారు మెగా ఫ్యాన్స్.
Also Read: ‘జల్సా’ రీ రిలీజ్ ఈసారి సక్సెస్ అవ్వడం కష్టమే..ఎందుకంటే!
ఇకపోతే నిన్న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా లో సెలబ్రిటీలందరు శుభాకాంక్షలు వెల్లువ కురిపించారు. అంతే కాకుండా ఆయన నటిస్తున్న కొత్త చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ ని కూడా మేకర్స్ విడుదల చేశారు. విశ్వంభర టీజర్ ని పుట్టిన రోజు ముందుగా విడుదల చేశారు, మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే విధంగా ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి తో చేస్తున్న ‘వరప్రసాద్ గారు పండక్కి వచ్చేస్తున్నారు’ టీజర్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఈ రెండు చిత్రాల తర్వాత సాయంత్రం డైరెక్టర్ బాబీ తో మరో సినిమాని ప్రకటించారు. ఇలా 70 ఏళ్ళ వయస్సు లో కూడా కుర్రాడిలా కష్టపడుతూ ముందుకు దూసుకెళ్తున్న మెగాస్టార్ చిరంజీవి ని చూసి నేటి తరం హీరోలు కూడా చాలానే నేర్చుకోవాల్సి ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.