Chiranjeevi Political Career: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలు అతన్ని భారీ లెవెల్లో ఎలివేట్ చేసి చూపించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసి పెట్టాయి. ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాలన్నీ అతనికి మంచి ఇమేజ్ ను సంపాదించి పెట్టడమే కాకుండా ప్రేక్షకులందరిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేశాయనే చెప్పాలి. ఇక చిరంజీవి 2009వ సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇక అప్పుడు ఆయన తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఇక ఆ తర్వాత తన పార్టీని నడపలేక కాంగ్రెస్ లో విలీనం చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ అతనికి కేంద్ర మంత్రిగా పదవి బాధ్యతలను అప్పగించారు. ఇక అప్పటి నుంచి చిరంజీవి ఆ తర్వాత మరోసారి రాజకీయా రంగానికి చాలా దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఒక వ్యక్తి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచినా కూడా వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్లకి పెన్షన్ అనేది వస్తుంది అనే విషయం మనందరికీ తెలిసిందే.
Also Read: తెలుగు లో టాప్ 5 రిచెస్ట్ హీరోలు వీళ్లేనా..?ఈ లిస్ట్ లో ఆ ఇద్దరు టాప్ హీరోలు లేరా.?
అయితే చిరంజీవికి తిరుపతిలో గెలిచినందుకు ఎమ్మెల్యేగా గాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నందుకు గాను రెండు పెన్షన్లు వస్తున్నాయి. ఎమ్మెల్యేగా గెలిచినందుకు 30000 రాజ్యసభ సభ్యుడు కింద 32000 మొత్తం కలిపి 62 వేల పెన్షన్ అయితే వస్తోంది. మరి ఇప్పటికి చిరంజీవి వాటిని తీసుకుంటూ ఉండడం విశేషం… ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి లాంటి నటుడు రాజకీయ రంగంలో సేవ చేయడానికి ముందుకు వచ్చినప్పటికి అక్కడున్న ఒడిదుడుకులను ఎదుర్కోలేక ఆయన వెనక్కి వచ్చి సినిమాలు చేసుకుంటున్నాడు. కారణం ఏంటి అంటే రాజకీయం అనేది ఒక బురద లాంటిది. అందులో దిగితే ఎన్నో విమర్శలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు.
Also Read: చిరంజీవి లైనప్ మామూలుగా లేదుగా..?ఈసారి కొత్త మెగాస్టార్ కనిపించబోతున్నాడా..?
దానికి చిరంజీవి సిద్ధంగా లేకపోవడం ఆయన జనానికి మంచి చేయాలని చూస్తే తనను చేయనీయకుండా చాలామంది పొలిటీషియన్స్ అడ్డుకోవడం ఇవన్నీ చూసిన చిరంజీవి సామాన్య మానవుడు గానే ఉంటూ జనానికి సేవ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమా ఇండస్ట్రీకి వచ్చి వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు…