Pushpa 2: పుష్ప 2 నుంచి రిలీజైన పోస్టర్ మీద కామెంట్స్ చేస్తున్న అల్లు అర్జున్ అభిమానులు…

టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న వాళ్లలో సుకుమార్ ఒకరు. ఆయన చేస్తున్న సినిమాలన్నీ సూపర్ సక్సెస్ లుగా నిలుస్తున్నాయి.

Written By: Vicky, Updated On : October 18, 2024 12:02 pm

Pushpa 2(4)

Follow us on

Pushpa 2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్స్ కొందరు మాత్రమే ఉన్నారు. అందులో సుకుమార్ ఒకరు. ప్రస్తుతం ఇండస్ట్రీ లో చాలామంది యంగ్ డైరెక్టర్స్ ఉన్నారు. అయినప్పటికీ ఎవరికి వారు వాళ్ళ జానర్స్ లో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఒక సినిమా సక్సెస్ సాధించాలంటే మాత్రం ఆ సినిమాకి కథ, కథనం అనేది చాలా కీలకపాత్ర వహిస్తూ ఉంటుంది. అది ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగా ఉంటే సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది. లేకపోతే మాత్రం సినిమా ఫ్లాప్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిషయోక్తి లేదు.

టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న వాళ్లలో సుకుమార్ ఒకరు. ఆయన చేస్తున్న సినిమాలన్నీ సూపర్ సక్సెస్ లుగా నిలుస్తున్నాయి. రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ కి ఇండస్ట్రీ హిట్ ను ఇచ్చిన ఆయన పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక అల్లు అర్జున్ కెరియర్ లో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందించిన దర్శకుడిగా కూడా తను ఇండస్ట్రీలో నిలవడం అనేది ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప 2 సినిమాని డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే రీసెంట్ గా సుకుమార్ ‘పుష్ప 2’ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ని రిలీజ్ చేస్తూ 50 డేస్ టు గో అంటూ ఆ పోస్టర్ లో మెన్షన్ చేశాడు.

ఇక దీన్ని బట్టి చూస్తే ఈ సినిమాని అనుకున్న డేట్ కి రిలీజ్ చేసే విధంగానే కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ పోస్టర్ ను చూసిన అల్లు అర్జున్ అభిమానులు మాత్రం సుకుమార్ మూవీ చాలా బాగా తీస్తున్నప్పటికి సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం చాలా కన్ఫ్యూజన్ తో అనౌన్స్ చేస్తున్నాడు.

మరి ఈ డేట్ కి అయిన పుష్ప 2 సినిమాను రిలీజ్ చేస్తారా లేదా అంటూ అల్లు అర్జున్ అభిమానులు వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక సుకుమార్ పోస్టర్స్ రిలీజ్ చేయడంలో పెట్టిన శ్రద్ధ సినిమా రిలీజ్ చేయడంలో మాత్రం పెట్టడం లేదు అంటూ అల్లు అర్జున్ అభిమానులు సుకుమార్ మీద తీవ్రమైన కామెంట్లైతే చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా సుకుమార్ మాత్రం ఈ సినిమాని డిసెంబర్ 6వ తేదీన థియేటర్ లోకి తీసుకొచ్చి బిగ్గెస్ట్ హిట్టుగా నిలిపే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన వర్క్ ని ఫినిష్ చేసే పనిలోనే సుకుమార్ చాలా బిజీగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది.

చూడాలి మరి ఈ సినిమాతో సుకుమార్ పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడా లేదా అనేది…ఇక ఏది ఏమైనా కూడా సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉండడం తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. పాన్ ఇండియాలో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకులలో సుకుమార్ కూడా ఒకరవ్వడం విశేషం…ఇక ఇప్పటికే ఆయన ఇంటలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాగే పుష్ప సిరీస్ తో మాస్ డైరెక్టర్ గా కూడా ఎదుగబోతున్నాడు…