https://oktelugu.com/

Aamir Khan: ఆర్జీవీ తర్వాత మరోసారి తెలుగు స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్న అమీర్ ఖాన్…కారణం ఏంటి..?

సినిమా ఇండస్ట్రీ అనగానే అందరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకు వస్తారు. కానీ వాళ్లు ఆ స్టేజ్ కి వెళ్ళడానికి మంచి కథలను అందించి వాటిని సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించిన దర్శకులు మాత్రం ఎవరికి కనిపించరు...

Written By:
  • Gopi
  • , Updated On : October 18, 2024 / 11:59 AM IST

    Aamir Khan

    Follow us on

    Aamir Khan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనాన్ని సృష్టించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ… ఒకప్పుడు ఆయన చేసిన శివ సినిమా భారీ సక్సెస్ ను సాధించిన విషయం మనకు తెలిసిందే. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు రామ్ గోపాల్ వర్మ వేసిన ముద్ర ను చెరిపేసే దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇలాంటి దర్శకుడు బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ అమీర్ ఖాన్, అమితాబచ్చన్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన విషయం కూడా మనకు తెలిసిందే… ముఖ్యంగా అమీర్ ఖాన్ తో చేసినా ‘రంగీలా ‘ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకుల్లో చెరగని ముద్రను వేసింది. నిజానికి రంగీలా సినిమాతో రాంగోపాల్ వర్మ తనను తాను ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నాడు. ఆయన ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేసి ప్రేక్షకులందరిని మెప్పించాడు… ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న వంశీ పైడిపల్లి సైతం ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లి అమీర్ ఖాన్ తో సినిమా చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే అమీర్ ఖాన్ కి రెండు కథలను వినిపించారట.

    మరి అందులో ఏ కథ ఫైనల్ అవుతుందనే విషయం మీద సర్వత్ర అసక్తి అయితే నెలకొంది. ఒక మంచి కథ కోసమే అమీర్ ఖాన్ చాలా సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నాడు. ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా తర్వాత అమీర్ ఖాన్ ఇప్పటివరకు మరొక సినిమాను చేయలేదు. ఈ సినిమా వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికి ఆయన మరొక సినిమా చేయకపోవడం వెనక చాలా విమర్శలైతే వస్తున్నాయి.

    మరి ఎందుకు ఇన్ని రోజులు ఆయన గ్యాప్ తీసుకున్నాడనే విషయాల మీద కూడా సరైన క్లారిటీ రావడం లేదు. అయితే అందుతున్న సంవత్సరం ప్రకారం మంచి కథ కోసం చూస్తున్న అమీర్ ఖాన్ కి వంశీ పైడిపల్లి చెప్పిన కథలు నచ్చినట్టుగా తెలుస్తోంది. మరి తొందర్లోనే ఈ సినిమాని పట్టాలెక్కించే పనిలో అమీర్ ఖాన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. కథ వినగానే అందులో కొన్ని కరెక్షన్స్ ని చెప్పి ఫైనల్ చేసిన ఆయన ఈ కథతో సినిమా చేసి ఎలాంటి సక్సెస్ సాధిస్తారు అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.

    ఇక వంశీ పైడిపల్లి గత చిత్రమైన వారసుడు సినిమా రొటీన్ రొట్ట ఫార్ములా సినిమా కథతో సాగుతుంది. అందువల్ల సినిమా ఆశించిన మేరకు సక్సెస్ అవ్వలేదు. మరి ఇప్పుడు అమీర్ ఖాన్ తో చేస్తున్న సినిమా విషయంలో వంశీ పైడిపల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది…