Diwali be celebrated: దీపావళి వేడుకలు ఏ సమయంలో నిర్వహించుకోవాలి? ఎలాంటి దుస్తులు ధరించాలి?

దీపావళి మహా పండుగ మరికొద్ది రోజుల్లో రాబోతుంది. దేశంలో ఘనంగా నిర్వహించుకునే ఫెస్టివెల్ లో దీపావళి ఒకటి. ఈ వేడుకను మూడు రోజుల పాటు నిర్వహించుకుంటారు. దీపావళికి ఒకరోజు ముందుగా ధన్ తే రాస్ , దీపావళి, ఆ తరువాత ప్రత్యేక నోములు నిర్వహించుకుంటూ ఉంటారు. ప్రతీ సంవత్సరం అశ్వయుజ మాసంలోని అమావాస్య నాడు దీపావళి వస్తుంది.

Written By: Srinivas, Updated On : October 18, 2024 12:09 pm

Diwali-celebrations

Follow us on

Diwali be celebrated: దీపావళి మహా పండుగ మరికొద్ది రోజుల్లో రాబోతుంది. దేశంలో ఘనంగా నిర్వహించుకునే ఫెస్టివెల్ లో దీపావళి ఒకటి. ఈ వేడుకను మూడు రోజుల పాటు నిర్వహించుకుంటారు. దీపావళికి ఒకరోజు ముందుగా ధన్ తే రాస్ , దీపావళి, ఆ తరువాత ప్రత్యేక నోములు నిర్వహించుకుంటూ ఉంటారు. ప్రతీ సంవత్సరం అశ్వయుజ మాసంలోని అమావాస్య నాడు దీపావళి వస్తుంది. 2024 సంవత్సరంలో అక్టోబర్ 31న దీపావళి ఉంటుందని తెలుస్తోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం నవంబర్ 1న దీపావళి వేడుకలు నిర్వహించాలని అంటున్నారు. ఈ తరుణంలో అసలు దీపావళి వేడుకను ఎప్పుడు నిర్వహించుకోవాలి? ఏ సమయంలో పూజలు చేయాలి? అనే సందేహం నెలకొంది. ఆ వివరాల్లోకి వెళితే..

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి వేడుకలు నిర్వహిస్తారని చరిత్ర చెబుతోంది. అమావస్య చీకట్లను పాలద్రోలడానికి దీపాలు వెలిగిస్తారని చెబుతారు. మహా విష్ణువు వరం పొందిన నరకాసురుడు గర్వంతో చెడ్డ పనులు చేస్తాడు. తన పనులతో ముల్లోకాలను పట్టి పీడిస్తాడు. నరకాసురుడి బాధలను భరించలేని దేవతలు తమ గోడు చెప్పుకునేందకు విష్ణువును ఆశ్రయిస్తాడు. అయితే మహావిష్ణువు కృష్ణావతరం ఎత్తి సత్యభామ చేత నరకాసరుడిని అంతం చేయిస్తాడు. ఇందుకు విజయంగా ఆరోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకుంటారు. నేటి కాలంలో ఇదే రోజున బాణ సంచా పేలుస్తూ వేడుకలు నిర్వహించుకుంటున్నారు.

దీపావళిని మూడు రోజుల పాటు నిర్వహించుకుంటారు. దీపావళికి ఒకరోజు ముందు ధన్ తే రాస్ ను నిర్వహిస్తారు. ఈరోజు ఇంటిని మొత్తం శుభ్రం చేసి పూజగదిని అలంకరిస్తారు. పాత వస్తువులు ఉంటే బయట పారేస్తారు. ఈరోజును ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత అసవరం ఉన్న కొత్త వస్తువులుకొనుగోలు చేస్తారు. ధన్ తే రాస్ రోజున లక్ష్మీ పూజలు చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. వ్యాపారులు ఈరోజు తమ సంస్థల్లో పూజలు నిర్వహించుకుంటారు.

2024లో దీపావళి అక్టోబర్ 31న ప్రారంభం కానుంది. ఈరోజు మధ్యాహ్నం 3. 12 గంటలకు అమావాస్య ప్రారంభం అయి నవంబర్ 1న సాయంత్రం 5.14 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలోనే దీపావళి వేడుకలు నిర్వహించుకోవాలని చెబుతున్నారు. అక్టోబర్ 31న సాయంత్రి పూజలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని చెబుతారు. ఈ కాలాన్ని ప్రదోష సమయం అంటారు. ప్రదోష సమయంలో పూజలు చేయడంతో శుభఫలితాలు ఉంటాయని అంటున్నారు. అయితే దీపావళి రోజున మట్టి ప్రమిదలు ఉపయోగించి మాత్రమే దీపాలు వెలిగించాలని చెబుతున్నారు. అలాగే ఈరోజు ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.

దీపావళి రోజున కొన్ని వస్తువులు ఇంటికి తీసుకురావడం వల్ల అంతా మంచే జరుగుతుందని అంటున్నారు. ముఖ్యంగా శ్రీ యంత్రం, లక్ష్మీ, వినాయక విగ్రహాలు కొనుగోలు చేయాలనుకునేవారు ఈరోజు ఇంటికి తెచ్చుకోవడం శుభప్రదం అంటున్నారు. అయితే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నల్లని దుస్తులు ధరించవద్దని, ఇలా చేయడం వల్ల అమ్మవారి ఆగ్రహానికి గురవుతారని చెబుతున్నారు. తెలుపు లేదా ఎరుపు వస్త్రాలు ధరించడం శుభప్రదంగా భావిస్తారు.