Allu Arjun: నార్త్ ఇండియాలో సక్సెస్ కావడం అంత సులభం కాదు. గతంలో టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, నాగార్జున ఆ ప్రయత్నం చేసి విరమించుకున్నారు. హీరోగా పీక్స్ లో ఉన్నప్పుడు చిరంజీవి హిందీ చిత్రాలు చేశారు. 1990లో ప్రతిబంధ్ పేరుతో స్ట్రెయిట్ హిందీ మూవీ చేశాడు చిరంజీవి. అది రాజశేఖర్ నటించిన బ్లాక్ బస్టర్ అంకుశం చిత్రానికి రీమేక్. హిందీలో ఆడింది. అనంతరం గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని ఆజ్ కా గూండా రాజ్ టైటిల్ తో చేశారు. చిరంజీవి నటించిన మరొక హిందీ చిత్రం ది జెంటిల్ మెన్. ఇది తమిళ చిత్రం జెంటిల్ మెన్ రీమేక్.
చిరంజీవి మూడు చిత్రాలు చేశాడు కానీ బ్రేక్ రాలేదు. హిందీ ఆడియన్స్ పూర్తి స్థాయిలో ఆయన్ని ఆదరించలేదు. అనంతరం చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమకే పరిమితం అయ్యారు. అలాగే శివ చిత్రాన్ని నాగార్జున హిందీలో రీమేక్ చేశారు. అక్కడ కూడా మూవీ విజయం సాధించింది. కుదా గవా, ద్రోహితో పాటు మరికొన్ని హిందీ చిత్రాలు చేశారు నాగార్జున. ఆయన కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు.
బాలీవుడ్ లో కూడా నెపొటిజం ఉంది. అవుట్ సైడర్స్ సక్సెస్ కావడం అంత ఈజీ కాదు. ఇతర భాషా చిత్రాలను తొక్కేస్తారు. బిజినెస్ జరగనీయరు. అందుకే రాజమౌళి తెలివిగా కరణ్ జోహార్ చేతుల్లో బాహుబలి సిరీస్ పెట్టాడు. దాని వలన కొంత నష్టపోయినప్పటికీ అక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా బాహుబలి, బాహుబలి 2 ఆడాయి. ప్రభాస్ కి నార్త్ లో ఫేమ్ ఉంది. బాహుబలి తర్వాత ఆయన నటించిన సాహో, కల్కి చిత్రాలు హిందీలో ఆడాయి.
పుష్ప మూవీతో అల్లు అర్జున్ జెండా పాతాడు. నిజానికి పుష్ప రెండు భాగాలుగా తీయాలని, పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయాలనే ఆలోచన సుకుమార్ కి లేదు. ఇది రాజమౌళి సలహానే అంటారు. పెద్దగా ప్రచారం లేకుండానే పుష్ప చిత్రాన్ని హిందీలో విడుదల చేశారు. అది మౌత్ టాక్ తో పుంజుకుని లాంగ్ రన్ లో రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అల్లు అర్జున్ క్రేజ్ పీక్స్ కి చేరింది. పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బీహార్ రాజధాని పాట్నాలో ఏర్పాటు చేయగా లక్షల మంది అభిమానులు వచ్చారు. ఒక తెలుగు హీరో కోసం హిందీ ప్రేక్షకులు ఈ స్థాయిలో రావడం ఊహించని పరిణామం. అసలు పుష్ప ఏ స్థాయిలో ప్రభావితం చేసిందనే దానికి పాట్నాలో జరిగిన ఈవెంట్ నిదర్శనం.
అయితే అల్లు అర్జున్ క్రేజ్ దేశవ్యాప్తం కావడం వెనుక తండ్రి అల్లు అరవింద్ కృషి చాలా ఉంది. ఒక పద్ధతి ప్రకారం అల్లు అర్జున్ ని ఆయన నార్త్ లో ప్రమోట్ చేశారు. అందుకు పీఆర్స్ సహకారం తీసుకున్నారు. అల వైకుంఠపురములో మూవీ నుండే దీనికి ప్రణాళికలు వేశారు. అప్పట్లో అల వైకుంఠపురములో చిత్రం పై కొందరు బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. అలా అల్లు అర్జున్ పేరు నార్త్ లో మొదటిసారి వినిపించింది.
పుష్ప విడులయ్యాక ఐపీఎల్ వంటి ఇంటర్నేషనల్ ఈవెంట్ లో అల్లు అర్జున్ మేనరిజమ్స్ ప్రముఖ క్రికెటర్స్ అనుకరించడం చర్చకు దారి తీసింది. వికెట్స్ తీసినప్పుడు,క్యాచ్ పట్టినప్పుడు, సిక్స్ కొట్టినప్పుడు పలువురు క్రికెటర్స్ పుష్ప మూవీలోని అల్లు అర్జున్ మేనరిజం అనుకరించారు. ఇది అల్లు అర్జున్ కి చాలా ప్లస్ అయ్యింది. అలా స్వచ్ఛందంగా చేశారా? పీఆర్స్ చేయించారా? అనే సందేహాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా అల్లు అర్జున్ ని ఇండియా వైడ్ పాప్యులర్ చేయడం వెనుక తండ్రి అల్లు అర్జున్ మాస్టర్ ప్లాన్స్ అయితే ఉన్నాయన్నది నిజం..