https://oktelugu.com/

Bigg Boss Telugu 8: 12వ వారం నామినేషన్స్ లోకి వచ్చిన 5 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే..బిగ్ బాస్ హిస్టరీ లో ఇలాంటి నామినేషన్స్ చూసి ఉండరు!

సోనియా వచ్చి నిఖిల్,ప్రేరణ ని నామినేట్ చేస్తుంది. ఈమె ఏమి మారలేదు. ప్రేరణ ని సరైన పాయింట్స్ తో నామినేట్ చేసి ఉంటే ఆమె నోటి నుండి మాట బయటకి వచ్చేది కాదు. అన్ని తప్పులు చేసింది ఆమె. కానీ సోనియా వీక్ పాయింట్స్ ని పట్టుకొని వచ్చింది, ఎదో రెండు మూడు ఎపిసోడ్స్ మాత్రమే చూసినట్టుగా ఉంది.

Written By: Vicky, Updated On : November 18, 2024 4:04 pm
Bigg Boss Telugu 8(225)

Bigg Boss Telugu 8(225)

Follow us on

Bigg Boss Telugu 8: ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ రెగ్యులర్ ప్రక్రియలో జరగడం లేదు, పాత కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేస్తారు అనే విషయం మీకు ఈరోజు ప్రోమో ని చూసినప్పుడే అర్థం అయ్యి ఉంటుంది. సోనియా హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చి నిఖిల్, ప్రేరణ ని నామినేట్ చేస్తుంది. ఈ నామినేషన్ లో యష్మీ, నిఖిల్ కి మధ్య కూడా గొడవ జరుగుతుంది. ప్రస్తుతం ఈ నామినేషన్ హాట్ స్టార్ లో టెలికాస్ట్ అవుతుంది. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. నామినేషన్స్ ప్రక్రియ నిన్ననే పూర్తి అయ్యింది. పాత కంటెస్టెంట్స్ లో సోనియా, ఆదిత్య ఓం, నైనిక, నాగ మణికంఠ, శేఖర్ బాషా, బెజవాడ బెబక్క వచ్చారు. వీళ్ళు యష్మీ,ప్రేరణ, పృథ్వీ, నిఖిల్, నబీల్ ని నామినేట్ చేసారు. దాదాపుగా ఓజీ క్లాన్ మొత్తం నామినేషన్స్ లోకి వచ్చేసింది. అయితే వీళ్ళు ఎవరెవరు, ఎవరిని నామినేట్ చేసారు అనేది ఇప్పుడు మనం క్లుప్తంగా చూడబోతున్నాము.

సోనియా వచ్చి నిఖిల్,ప్రేరణ ని నామినేట్ చేస్తుంది. ఈమె ఏమి మారలేదు. ప్రేరణ ని సరైన పాయింట్స్ తో నామినేట్ చేసి ఉంటే ఆమె నోటి నుండి మాట బయటకి వచ్చేది కాదు. అన్ని తప్పులు చేసింది ఆమె. కానీ సోనియా వీక్ పాయింట్స్ ని పట్టుకొని వచ్చింది, ఎదో రెండు మూడు ఎపిసోడ్స్ మాత్రమే చూసినట్టుగా ఉంది. ఈమె సంగతి పక్కన పెడితే నాగ మణికంఠ నిఖిల్ , నబీల్ ని నామినేట్ చేస్తాడు. నిఖిల్ మీద అతనికి చాలా పాయింట్స్ ఉన్నాయి, నామినేట్ చేయడం లో తప్పు లేదు. కానీ స్నేహితుడైన నబీల్ ని ఎందుకు నామినేట్ చేసాడు అనేది తెలియాల్సి ఉంది. అదే విధంగా శేఖర్ బాషా యష్మీ, ప్రేరణ లను నామినేట్ చేయగా, బెజవాడ బెబక్క నిఖిల్, పృథ్వీ లను నామినేట్ చేస్తుంది. నైనిక యష్మీ, నబీల్ ని నామినేట్ చేసినట్టు సమాచారం.

నామినేషన్స్ లోకి వచ్చిన 5 మంది కంటెస్టెంట్స్ స్ట్రాంగ్ కాబట్టి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రేరణ గత నాలుగు వారాల నుండి బాగా నెగటివ్ అయ్యింది. ఈమె వీరాభిమానులు తప్ప, సాధారణ ప్రేక్షకులు ఈమెకు వోట్ వేసే పరిస్థితులు ప్రస్తుతం కనిపించడం లేదు. అదే విధంగా యష్మీ కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్టే. గత వారం ఎలిమినేషన్ లేదు కాబట్టి, ఈ వారం వీళ్లిద్దరు డబల్ ఎలిమినేషన్ ప్రక్రియ లో ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మధ్యలో వీళ్ళ తీరు మారితే గ్రాఫ్స్ మారొచ్చు. యూట్యూబ్ పోల్స్ లో ప్రేరణకి మంచి ఓటింగ్ పడుతుంది, కానీ ఇంస్టాగ్రామ్ లో మాత్రం తక్కువే. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ చాలా ఆసక్తి గా ఉండబోతుంది.