Allu Arjun : అల్లు అర్జున్(Icon Star Allu Arjun) కి మెగా ఫ్యామిలీ కి రోజురోజుకి గ్యాప్ పెరిగిపోతూ వెళ్తుంది అనే వాదన గడిచిన రెండు మూడు సంవత్సరాల నుండి మనం సోషల్ మీడియా లో, ఎలక్ట్రానిక్ మీడియా లో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా అల్లు అర్జున్ నంద్యాలకు వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి వద్దకు ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పటి నుండి ఈ గ్యాప్ ఇంకా ఎక్కువ అయిపోయింది. అంతే కాకుండా అల్లు అర్జున్ తన ఈవెంట్స్ లో ‘నేను ఫ్యాన్స్ ని చూసి హీరో అయ్యాను’, ‘నాకు ఇష్టముంటేనే ఎక్కడికైనా వస్తా’ వంటి కామెంట్స్ చేయడం కూడా మెగా అభిమానులను మరింత రెచ్చగొట్టినట్టు అయ్యింది. అయితే మా మధ్య ఎలాంటి గ్యాప్ లేదని అల్లు అర్జున్ అనేక సందర్భాల్లో చెప్పే ప్రయత్నం కూడా చేసాడు. రీసెంట్ గా అలాంటి ఘటనే ఒకటి రిపీట్ అయ్యింది.
Also Read : అల్లు అర్జున్, అట్లీ సినిమాలో హీరోయిన్ ఆమేనా..? ఫ్యాన్స్ ఏమైపోతారో!
ముంబై లో కేంద్ర ప్రభుత్వం చేత ‘వేవ్'(Wave Summit) అనే కార్యక్రమం నివహించారు. ఈ ఈవెంట్ కి అన్ని ఇండస్ట్రీస్ నుండి ప్రముఖులు విచ్చేసి సందడి చేశారు. వారిలో అల్లు అర్జున్ కూడా ఒకరు. ఆయన మాట్లాడుతూ ‘మా మమ్మయ్య చిరంజీవి(Megastar Chiranjeevi) గారు నాకు పెద్ద ఆదర్శం. ఈరోజు నేను ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం ఆయనే. ఆయన ప్రభావం నాపై చాలా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు. అదే విధంగా మీరు ఇంత ఫిట్ గా ఉండడానికి కారణం ఏమిటి అని అడిగిన ప్రశ్నకు అల్లు అర్జున్ సమాధానం చెప్తూ ‘మానసికంగా ప్రశాంతంగా ఉంటాను. అదే నా ఫిట్నెస్ కి కారణం అంటూ చెప్పుకొచ్చాడు’. ఇక తన కెరీర్ గురించి మాట్లాడుతూ ‘ప్రతీ నటుడి లాగానే నేను కూడా కెరీర్ లో ఎన్నో సవాళ్ళను ఎదురుకొని, వాటిని అధిగమించి ఈరోజు మీ ముందు ఇలా కూర్చున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read : అల్లు అర్జున్ అట్లీ మూవీ ఓపెనింగ్ డేట్ వచ్చేసిందిగా..?
చిన్నతనం నుండి డ్యాన్స్ అంటే విపరీతమైన ఇష్టమని, ఇష్టం తో చేసే పని కాబట్టే, డ్యాన్స్ లో మంచి పేరు తెచ్చుకున్నానని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు. ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు త్వరలోనే మొదలు కాబోతున్నాయి. రీసెంట్ గానే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఒక స్పెషల్ వీడియో ని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ వీడియో తోనే ఈ చిత్రం ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పుకొచ్చారు. సుమారుగా 600 కోట్ల రూపాయిల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు మేకర్స్. సన్ పిక్చర్స్ సంస్థ నుండి రాబోతున్న మొట్టమొదటి తెలుగు హీరో సినిమా ఇదే. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారట. వారిలో ఇప్పటికే మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ ఖరారు అయ్యినట్టు తెలుస్తుంది.
The MEGASTAR | It's A Brand
Finally AA About Our Boss ❤️
Evaraina Naa Chiranjeevi Tharuvathey@KChiruTweets #Chiranjeevi@alluarjun #AlluArjun #MegastarChiranjeevi pic.twitter.com/YimIk1NXIA
— We Love Chiranjeevi (@WeLoveMegastar) May 1, 2025