Allu Arjun And Atlee Movie: అల్లు అర్జున్(Icon Star Allu Arjun) పుట్టినరోజు సందర్భంగా అట్లీ(Director Atlee) మూవీ తో చేయబోతున్న సినిమా గురించి సంచలన మేకింగ్ వీడియో ని విడుదల చేయగా, అది ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో మనమంతా చూసాము. తెలుగు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లే విధంగా ఆ వీడియో ఉంది. సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కబోతున్న సినిమా అని ఇప్పటికే ఫ్యాన్స్ కి ఒక క్లారిటీ వచ్చేసింది. అదే విధంగా ఈ చిత్రంలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకటి విలన్ క్యారక్టర్ అని తెలుస్తుంది. మొన్న విడుదల చేసిన వీడియోలో ఆ చిన్న హింట్ కూడా ఫ్యాన్స్ కి ఇచ్చేసాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం దాదాపుగా పూర్తి అయ్యిందట. ఇక ఈ సినిమాలో నటించబోయే నటీనటుల ఎంపిక చకచకా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే హీరోయిన్ గా పలువురు పేర్లు పరిశీలించారు.
Also Read: ‘హిట్ 3’ టీం కి వార్నింగ్ ఇచ్చిన సెన్సార్ బోర్డు..మరీ ఇంత దారుణమా!
చివరికి జాన్వీ కపూర్(Jhanvi Kapoor) ని లాక్ చేసినట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. జాన్వీ కపూర్ కి బాలీవుడ్ లో ఉన్నంత వరకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఎప్పుడైతే ఆమె టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిందో, ఆమెకు మహర్దశ పట్టుకుంది అనే చెప్పాలి. వరుసగా భారీ సినిమాల్లో హీరోయిన్ అవకాశాలను దక్కించుకుంటూ టాలీవుడ్ లో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్ గా మారిపోయింది. ‘దేవర’ చిత్రం పెద్ద హిట్ అయిన వెంటనే ఆమె గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ‘పెద్ది’ అనే చిత్రం చేస్తుంది. ఈ సినిమా తర్వాత వెంటనే ఆమె అల్లు అర్జున్, అట్లీ సినిమా చేయబోతుంది. రీసెంట్ గానే అట్లీ ఆమెను కలిసి కథ కూడా వినిపించాడట. తనకు ఇష్టమైన సౌత్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ అని ఇది వరకే జాన్వీ కపూర్ అనేక ఇంటర్వ్యూస్ చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ తో సినిమా చేసేసింది, ఇప్పుడు అల్లు అర్జున్ తో చేయబోతుంది.
ఇకపోతే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా అనిరుద్ రవిచంద్రన్ ని తీసుకుందామని ముందుగా అనుకున్నారు. కానీ అనిరుద్ చేతిలో ఏడాదికి సరిపడా సినిమాలు ఉన్నాయి. ఉన్నవాటికి ఆయన సమయం కేటాయించలేకపోతున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకు ఇప్పట్లో డేట్స్ ఇవ్వలేని అని చెప్పడం తో యంగ్ సెన్సేషన్ సాయి అభయంకర్ కి ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశం ఇచ్చారు. పలు ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా సాయి అభయంకర్ ఇప్పటికే యూత్ ఆడియన్స్ లో ప్రత్యేకమైన క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాతో ఆయన తన టాలెంట్ ని నిరూపించుకుంటే మరో అనిరుద్ అవుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు . పైగా అల్లు అర్జున్ మ్యూజిక్ టేస్ట్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ది బెస్ట్ వచ్చే వరకు ఆయన మ్యూజిక్ డైరెక్టర్స్ పై ఒత్తిడి పెడుతాడు, కాబట్టి ఈ చిత్రానికి కూడా బ్లాక్ బస్టర్ ఆడియో వచ్చే అవకాశాలు ఉన్నాయి.