Allu Arjun : నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు సంబరాల్లో, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. అభిమానులకు కూడా ఆయన అద్భుతమైన సర్ప్రైజ్ ని అందిస్తూ త్వరలో తాను అట్లీ తో చేయబోతున్న సినిమా గురించి ఒక స్పెషల్ వీడియో ద్వారా అధికారిక ప్రకటన చేయించాడు. ఈ వీడియో కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేపింది. ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాల్లో కనిపించిన అల్లు అర్జున్, ఈ సినిమా తో సైన్స్ ఫిక్షన్ జానర్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఎన్నో హాలీవుడ్ చిత్రాలకు VFX పనులు చేసిన లోలా సంస్థ ఈ సినిమాకు కూడా పని చేయబోతుంది. షూటింగ్ కార్యక్రమాలను ఈ ఏడాదిలోనే మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే నిన్న అల్లు అర్జున్ పుట్టినరోజు ని టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు అని అభిమానులు చాలా అసంతృప్తి తో ఉన్నారు.
Also Read : ప్రకటన వీడియో కి 60 లక్షల వ్యూస్..అల్లు అర్జున్ క్రేజ్ కి హద్దులే లేవు!
గత నెలలో జరిగిన రామ్ చరణ్ పుట్టినరోజుకు దాదాపుగా ఆయన తోటి నటీనటులందరూ శుభాకాంక్షలు తెలియజేసారు. కానీ అల్లు అర్జున్ కి కేవలం జూనియర్ ఎన్టీఆర్ తప్ప, ఇంకెవ్వరు శుభాకాంక్షలు తెలియజేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రతీ హీరో పుట్టినరోజుకు మర్చిపోకుండా శుభాకాంక్షలు తెలియజేసే అలవాటు ఉన్న మహేష్ బాబు(Super Star Mahesh Babu) కూడా అల్లు అర్జున్ ని పట్టించుకోలేదు. ఇక మెగా ఫ్యామిలీ నుండి అయితే ఒక్కరు కూడా అల్లు అర్జున్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయకపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) చిన్న కొడుకు ప్రాణాపాయ స్థితి నుండి బయటపడి, హాస్పిటల్ లో అతి ముఖ్యమైన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అలాంటి సమయంలో అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు తెలపడం సరైన నిర్ణయం కాదు, కానీ మిగిలిన సెలబ్రిటీస్ కి ఏమైంది అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
టాలీవుడ్ లో ఉండే ప్రతీ హీరో సినిమాకు విడుదలకు ముందు శుభాకాంక్షలు తెలియచేయడం, ప్రతీ హీరో పుట్టినరోజు కి విష్ చేయడం వంటివి, ఎలాంటి పరిస్థితి లోనైనా సాయి ధరమ్ తేజ్ మిస్ చేయడు, ఆయన కూడా అల్లు అర్జున్ ని నిన్న పట్టించుకోలేదు. ఇక అల్లు అర్జున్ కి అత్యంత సన్నిహితులైన ప్రభాస్, రానా దగ్గుబాటి వంటి వారు కూడా మౌనం గా ఉండడం గమనార్హం. సమంత, రకుల్ ప్రీత్ సింగ్, రష్మిక, విజయ్ దేవరకొండ, సిద్ధు జొన్నలగడ్డ వంటి వారు మాత్రమే శుభాకాంక్షలు తెలిపారు. పుష్ప 2 చిత్రం తో దేశం మొత్తం గర్వపడేలా చేసిన అల్లు అర్జున్ ని మన టాలీవుడ్ సెలబ్రిటీలు ఎందుకు పట్టించుకోవడం లేదు, అతని సక్సెస్ ని చూసి అసూయ పడుతున్నారా? అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Also Read : కుటుంబ సభ్యులతో అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకలు..ఫోటోలు వైరల్!