Allu Arjun birthday celebrations : నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఏ రేంజ్ లో సంబరాలు చేసుకుంటున్నారో మనమంతా చూసాము. మూడు రోజుల క్రితమే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆర్య 2(Arya2 Re Release) చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆల్ టైం రికార్డు అయితే రాలేదు కానీ, మూడు రోజుల్లో దాదాపుగా నాలుగు కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇకపోతే నేడు అట్లీ తో చేయబోతున్న సినిమా గురించి అధికారిక ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన వీడియో ని సన్ పిక్చర్స్(Sun Pictures) విడుదల చేయగా, అది సెన్సేషనల్ గా మారింది. సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కేవలం ప్రకటన వీడియో తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పటి వరకు అల్లు అర్జున్ కానీ, డైరెక్టర్ అట్లీ కానీ ముట్టుకోని జానర్ ఇది.
Also Read : లోలా ‘VFX’ ప్రత్యేకతలు ఏమిటి..? అల్లు అర్జున్ కి ఎందుకు అంత ఆసక్తి?
అభిమానులు ఇంకా ఈ వీడియో ఇచ్చిన హ్యాంగ్ ఓవర్ నుండి కోలుకోలేదు. ఇదంతా పక్కన పెడితే మరో పక్క అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయగా, అవి బాగా వైరల్ అయ్యాయి. అల్లు అర్జున్, ఆయన సతీమణి అల్లు స్నేహా రెడ్డి, అల్లు అయాన్, అల్లు అర్హా ఈ ఫోటోలలో కనిపించారు. అంతే కాకుండా అభిమానులు అర్థ రాత్రి అల్లు అర్జున్ ఇంటి వద్దకు వందలాది సంఖ్యలో హాజరై ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి వెళ్లారు. ఆ సమయంలో అల్లు అర్జున్ ఇంట్లో లేడు. నేడు ఉదయం మాత్రం ఆయన ఇంటి నుండి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేసాడు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఈ పుట్టినరోజు అల్లు అర్జున్ కి ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఆయన పుష్ప 2 తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి వదిలాడు. అంతే కాకుండా ఈ మూడు నెలల్లో ఆయన ఎన్నో అవమానాలను కూడా ఎదురుకోవాల్సి వచ్చింది. సంధ్య థియేటర్ ఘటన ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇది అల్లు అర్జున్ ని మాత్రమే కాదు, ఇండస్ట్రీ ని కూడా ఇబందుల్లోకి నెట్టేసింది. ఒకప్పటి లాగా ఇప్పుడు బెనిఫిట్ షోస్, టికెట్ హైక్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతిని ఇవ్వడం లేదు. భవిష్యత్తులో ఇస్తారు అన్న ఆశలు కూడా లేవు. ఇలా ఎన్నో సంఘటనలు అల్లు అర్జున్ ని పరోక్ష కారణంగా చూపిస్తూ మీడియా ప్రచారం చేసింది. వీటి అన్నిటి నుండి ఆయన కోలుకొని నేడు మళ్ళీ అభిమానులను ఉత్సాహపరిచే సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. రాబోయే రోజుల్లో ఆయన రేంజ్ ఎలా ఉండబోతుందో చూడాలి.
Also Read : జంతువులు.. రోబోలు.. అల్లు అర్జున్-అట్లీ కథ ఏంటంటే..?