Allu Arjun and Atlee : ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేసిన హీరో అల్లు అర్జున్ (Allu Arjun)…ఆయన చేసిన సినిమాలన్నీ ఒకెత్తయితే పుష్ప 2 సినిమా మరొక ఎత్తుగా మారింది. పాన్ ఇండియాలో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టిన ఈ సినిమాతో అల్లు అర్జున్ కాకుండా ఇండియాలోనే నెంబర్ వన్ లో హీరోగా ఎదిగే అవకాశం ఉందని చెప్పకనే చెప్పాడు…ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత ఆయన ఇప్పుడు అట్లీ డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ అల్లు అర్జున్ కాంబోలో సినిమా రాబోతుంది అంటూ దానికి సంబంధించిన ఒక వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. మొత్తానికైతే ఈ వీడియో నుబట్టి చూస్తే వీళ్లిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా ఒక హైలీ గ్రాఫికల్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కబోతుంది అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ప్రపంచాన్ని నాశనం చేసే దుష్ట శక్తుల నుండి హీరో ఈ ప్రపంచాన్ని ఎలా కాపాడాడు అనేదే కథగా చూపించబోతున్నారట. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటు మరొక స్టార్ హీరో కూడా నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
Also Read : అల్లు అర్జున్ అట్లీ మూవీ ఓపెనింగ్ డేట్ వచ్చేసిందిగా..?
తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన విక్రమ్ ఈ సినిమాలో ఒక 15 నిమిషాల పాత్రను పోషించబోతున్నాడట. ఇక విక్రమ్ పాత్ర సినిమాకి హైలైట్ గా మారబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే సినిమా యూనిట్ నుంచి ఆర్టిస్టుల విషయంలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రానప్పటికి కోలీవుడ్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం విక్రమ్ ఇందులో ఒక కీలకపాత్రలో నటించడానికి సిద్ధమయ్యారట.
అట్లీ కూడా అతనికి కథ చెప్పి అతన్ని ఒప్పించినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తానికైతే విక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుంది. తద్వారా అల్లు అర్జున్ కు ఎలాంటి గుర్తింపును తీసుకొస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. 700 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తుంది అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి.
మరి అల్లు అర్జున్ ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని నెంబర్ వన్ హీరోగా ఎదుగుతాడా? లేదంటే ఈ సినిమాతో ప్లాప్ ని మూటగట్టుకొని మరోసారి తన మార్కెట్ ను భారీగా కోల్పోతాడా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read : అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ కి ముహూర్తం ఫిక్స్ అయిందా..?