Allu Arjun and Atlee : సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) పాన్ ఇండియా సినిమాలు చేస్తూ స్టార్ హీరోలకు సైతం పోటీని ఇస్తూ తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని సంపాదించుకున్న ఆయన ఇకమీదట చేయబోయే సినిమాలతో భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నాడు… గత సంవత్సరం ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించిన ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో మరోసారి పెను రికార్డ్ లను క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. మరి ఇక మీదట తను చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవ్వబోతుంది అనేది తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఆయన అట్లీ (Atlee) డైరెక్షన్ లో చేస్తున్న భారీ బడ్జెట్ సినిమాని 2027 క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25వ తేదీన రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఈ సినిమా రిలీజ్ కి దాదాపు ఇంకా రెండున్నర సంవత్సరాల సమయం అయితే ఉంది. మరి ఈ సమయంలో ఈ సినిమాని చాలా చక్కగా తీర్చిదిద్ది ఎలాగైనా సరే బ్లాక్ బాస్టర్ గా నిలపాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు అట్లీ అయితే ఉన్నారట. మరి అల్లు అర్జున్ సైతం ఈ సినిమా కోసం అట్లీ కి చాలా వరకు సహకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ సైతం ఈ సినిమా కోసం తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఎలాంటి కష్టం అయినా భరించి ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడు.
Also Read : అల్లు అర్జున్, అట్లీ సినిమాలో హీరోయిన్ ఆమేనా..? ఫ్యాన్స్ ఏమైపోతారో!
ఇక తను అనుకున్నట్టుగానే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తన మార్కును చూపించగలుగుతాడా? పుష్ప 2 (Pushpa 2) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను మాత్రమే బ్రేక్ చేయగలిగిన ఆయన ఇప్పుడు పాన్ ఇండియాలో దంగల్ (Dangal) పేరు మీద ఉన్న రికార్డ్స్ ను బ్రేక్ చేసి మరి తనకంటూ ఒక కొత్త రికార్డుని క్రియేట్ చేస్తాడు అంటూ అతని అభిమానులు చాలా వరకు కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నారు.
మరి వాళ్ళ కోసం ఏదైనా చేస్తాను అంటూ అల్లు అర్జున్ గతంలోనే చాలా వరకు మాటలైతే చెప్పాడు. మరి వాటికి కట్టుబడి ఈ సినిమా కోసం ఎంతటి రిస్క్ అయినా చేసి ప్రేక్షకులు కాలర్ ఎగరేసుకునే విధంగా ఈ సినిమాని తీర్చిదిద్ది ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలుపుతానని ప్రామిస్ చేసినట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. వరుసగా మూడు విజయాలతో సూపర్ సక్సెస్ లను అందుకుంటున్న ఆయన ఈ సినిమాతో కనక భారీ విజయాన్ని అందిస్తే పాన్ ఇండియాలో ఇక అతనికి తిరుగుండదనే చెప్పాలి.
Also Read : అల్లు అర్జున్ అట్లీ మూవీ ఓపెనింగ్ డేట్ వచ్చేసిందిగా..?