IPL : తాజాగా మంగళవారం నుంచి నిర్వహిస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. ఉద్రిక్తత ఇంకా తగ్గకపోవడంతో నిరవధికంగా వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. బీసీసీఐ పెద్దలు డబల్ హెడర్ ద్వారా మ్యాచ్లో నిర్వహిస్తామని చెబుతున్నప్పటికీ అది సాధ్యమవుతుందా? కేంద్ర అనుమతి ఇస్తుందా? అనే ప్రశ్నలు ఇంకా మెదులుతూనే ఉన్నాయి. మరోవైపు మే 25 న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నప్పటికీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదని తెలుస్తోంది. క్రికెట్ మ్యాచ్లు చూసేందుకు ప్రేక్షకులు భారీగా వస్తుంటారు. ఒకవేళ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో కాకుండా దక్షిణాది రాష్ట్రాలలోని ప్రముఖ నగరాలైన చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో నిర్వహించే వీలున్నప్పటికీ.. భారీగా ప్రేక్షకులు వచ్చినప్పుడు ఏదైనా జరగరానిది జరిగితే అప్పుడు ఏంటనేది అంతుపట్టకుండా ఉంది. మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులు మైదానాలకు భారీగా హాజరవుతారా.. క్రికెట్ మ్యాచ్లను ఆస్వాదిస్తారా అనే ప్రశ్న కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇటీవల ఢిల్లీ, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ధర్మశాల వేదికకు ప్రేక్షకులు భారీగానే వచ్చారు. కానీ ఎప్పుడైతే ఉగ్ర దేశం బార్డర్లో దారుణాలకు పాల్పడిందో.. వెంటనే కేంద్రం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో నిర్వాహకులు వెంటనే మ్యాచ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు ముందుగా ఫ్లాట్ లైట్లలో సాంకేతిక సమస్య ఉందని నిలిపివేశారు. ఆ తర్వాత నెమ్మదిగా ప్రేక్షకులకు అసలు విషయం చెప్పి జాగ్రత్తగా వారి వారి స్వస్థలాలకు వెళ్లే విధంగా చేశారు.
Also Read : ఐపీఎల్ పై బీసీసీఐ కీలక నిర్ణయం.. ఫైనల్ మ్యాచ్ జరిగేది అప్పుడే..
ఎంత నష్టమంటే
బార్డర్లో నెలకొన్న కఠినమైన పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ వాయిదా పడుతోంది. అయితే ఈ వాయిదా పడటం వల్ల అటు బీసీసీఐకి.. ఇటు బ్రాడ్కాస్టర్లకు విపరీతంగా నష్టం వాటిల్లుతోంది. తూలంగా ఒక్కో మ్యాచ్ కు 60 కోట్ల చొప్పున.. వారంలో దాదాపు ఐదు నుంచి ఏడు మ్యాచ్లకు గానూ బిసిసిఐ 300 నుంచి 400 20 కోట్లు నష్టపోయింది. బ్రాడ్కాస్టర్లు 5,500 కోట్లు నష్టపోయారు. ఇక ఫారం ప్లేయర్లు వారి సొంత దేశాలకు వెళ్లిపోయారు. ఒకవేళ ఐపీఎల్ మళ్లీ మొదలైతే వారిని తిరిగి ఇండియాకు రప్పించాలి. ఒకవేళ ఇండియాకు కనుక వారు రావడానికి సుముఖత వ్యక్తం చేయకపోతే.. వారి స్థానంలో ఇతర ప్లేయర్లతో ఆడించాల్సి ఉంటుంది. మొత్తంగా ముష్కర దేశం చేసిన పనికిమాలిన పని వల్ల మనదేశంలో క్రికెట్ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నది. అంతటి కరోనా సమయంలోనూ ఇంతటి ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తలేదు. అయితే ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి బీసీసీఐ ఎటువంటి ప్రయత్నం చేస్తుంది.. బ్రాడ్కాస్టర్లకు ఎటువంటి భరోసా ఇస్తుందనేది చూడాల్సి ఉంది. అయితే ముందుగానే ప్రమోటర్లతో ఒప్పందాలు కుదుర్చుకున్న నేపథ్యంలో.. నష్టం త్వరగానే భర్తీ అవుతుందని మరో వాదన కూడా వినిపిస్తోంది. ప్రమోటర్లు.. కార్పొరేట్ కంపెనీలకు ప్రేక్షకులు మైదానాలకు వస్తేనే దండిగా ఆదాయం వస్తుంది. ప్రేక్షకులు రాకపోతే వారు మాత్రం అంతగా పెట్టుబడి ఎందుకు పెడతారనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. సరిహద్దుల్లో ఇంకా అటువంటి విపత్కర పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో.. ఐపీఎల్ నిర్వహణ ముందుకు సాగుతుందా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు లభిస్తుందో మరి.
Also Read : వాయిదా ఎత్తివేత.. రేపు బిసిసిఐ పెద్దల భేటీ.. ఐపీఎల్ మళ్లీ ఎప్పటినుంచంటే?