Allu Arjun and Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), అల్లు అర్జున్(Icon Star Allu Arjun) మధ్య ఇప్పటి వరకు ఎలాంటి బాక్స్ ఆఫీస్ వార్ జరగలేదు. వీళ్లిద్దరి సినిమాలు రోజుల వ్యవధి గ్యాప్ లో ఎప్పుడూ రాలేదు. కేవలం హ్యాపీ, జై చిరంజీవ సినిమాలు మాత్రమే నెల గ్యాప్ లో విడుదలయ్యాయి. అప్పట్లో నెల గ్యాప్ అంటే క్లాష్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆరోజుల్లో థియేట్రికల్ రన్ చాలా ఎక్కువగా ఉండేది కాబట్టి. ఇక 2006 వ సంవత్సరం తర్వాత చిరంజీవి సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వెళ్లడంతో ఇలాంటి క్లాష్ అంశాలు చర్చకు కూడా రాలేదు. ఇక రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న సంగతి తెలిసిందే. రీ ఎంట్రీ తర్వాత కూడా మామ అల్లుడి మధ్య ఎలాంటి క్లాష్ రాలేదు. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారి చిరంజీవి, అల్లు అర్జున్ సినిమాలు ఒకే రోజున విడుదల కాబోతున్నాయి.
Also Read: ఐపీఎల్ లో ప్లే ఆఫ్ వెళ్లే జట్లు ఇవే.. పది టీమ్ లకు అవకాశాలు ఎలా ఉన్నాయంటే..
పూర్తి వివరాల్లోకి వెళ్తే అల్లు అర్జున్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘దేశముదురు’ చిత్రాన్ని మే 10న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో రీ రిలీజ్ కాబోతుంది. పోకిరి తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. 2023 వ సంవత్సరం లో ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ గా విడుదల చేశారు. ఆ సమయంలో ఈ సినిమాకు దాదాపుగా కోటి 50 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు మరోసారి రీ రిలీజ్ కాబోతుంది. ఇదే రోజున మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా నిల్చిన చిత్రం, అప్పట్లో ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ని కూడా రీ రిలీజ్ చేయబోతున్నారు.
కేవలం 2D లో మాత్రమే కాకుండా 3D వెర్షన్ లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం అని మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ఒక పాత సూపర్ హిట్ సినిమాని 3D వెర్షన్ లోకి మార్చి విడుదల చేయడం అనేది ఇప్పటి వరకు మన టాలీవుడ్ హిస్టరీ లోనే కాదు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే జరగలేదు. అభిమానులు కచ్చితంగా ఈ రీ రిలీజ్ సెన్సేషన్ సృష్టిస్తుందని అంటున్నారు. సోషల్ మీడియా లో మెగా మరియు అల్లు ఫ్యాన్స్ మధ్య వివాదాలు నడుస్తున్న సమయంలో ఇలాంటి క్లాష్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి మామ అల్లుడి మధ్య జరగబోతున్న ఈ పోరులో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి. కచ్చితంగా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రానికి కాస్త ఎడ్జ్ ఉండొచ్చు. చూడాలి మరి ఈ పోరులో ఎవరు విజయం సాధించబోతున్నారు అనేది.
Also Read: కేఎల్ రాహుల్ కాంతారా స్టెప్ వేసి టీజ్ చేసిన కోహ్లీ: వీడియో వైరల్