Retro : తమిళ హీరో సూర్య(Suriya Sivakumar) ఈసారి ‘రెట్రో'(Retro Movie) చిత్రం తో కుంభస్థలం బద్దలు కొట్టేలాగానే ఉన్నాడు. ‘కంగువ’ లాంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత సూర్య ఇక కోలుకోవడం ఇప్పట్లో కష్టమే అని అంతా అనుకున్నారు. కానీ ‘రెట్రో’ టీజర్ ఎప్పుడైతే విడుదలైందో, అప్పటి నుండే ఈ చిత్రం పై అంచనాలు తారా స్థాయిలో పెరిగాయి. ఇది కదా సూర్య మార్క్ సినిమా అంటే, అని అభిమానులు అనుకున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ అభిమానుల ఆకలి తీరే విధంగా బలమైన సినిమాని అందిస్తున్నది అంతా ఆశించారు. టీజర్ తర్వాత విడుదలైన ట్రైలర్ అయితే వేరే లెవెల్ అనుకోవచ్చు. ‘కన్నిమ్మ’ పాట కూడా సూపర్ హిట్ అయ్యింది. ఎక్కడ చూసినా ఈ పాటనే వినిపిస్తుంది ఇప్పుడు. ఇన్ స్టాగ్రామ్ లో లక్షల సంఖ్యలో రీల్స్, యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి.
Also Read : రెట్రో’ ని డబుల్ మార్జిన్ తో డామినేట్ చేస్తున్న ‘హిట్ 3’ అడ్వాన్స్ బుకింగ్స్!
ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ నిన్నటి నుండి ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో మొదలయ్యాయి. ముందుగా తెలుగు లో బుకింగ్స్ ప్రారంభించారు. ఇక్కడ ఆశించిన స్థాయిలో బుకింగ్స్ లేకపోవడం తమిళనాడు లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుందా అని కాస్త భయపడ్డారు ట్రేడ్ విశ్లేషకులు. కానీ తమిళనాడు లో ఈ చిత్రం బుకింగ్స్ ప్రారంభం అయిన వెంటనే, బుక్ మై షో యాప్ లో గంటకు 15 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. సూర్య సినిమాకు ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటి వరకు ఒక్క సినిమాకు కూడా జరగలేదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘కంగువ’ చిత్రానికి కూడా ఇలాంటి ట్రెండ్ కనపడలేదు. అభిమానులు ఈ ట్రెండ్ ని చూసి ఎంతో మురిసిపోతున్నారు. కేవలం చెన్నై సిటీ నుండి 24 గంటలు కూడా పూర్తి కాక ముందే కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట.
ఓవరాల్ గా తమిళనాడు లో బుక్ మై షో యాప్ నుండి 3 కోట్ల రూపాయిల గ్రాస్ బుకింగ్స్ మొదలైన 24 గంటలోపే వచ్చిందట. రీసెంట్ గా విడుదలైన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం రేంజ్ లో వచ్చిందని చెప్పొచ్చు. ఫైనల్ గ్రాస్ కూడా మొదటి రోజు ఆ సినిమాకు సరిసమానంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సూర్య కం బ్యాక్ ఇస్తున్నాడని అభిమానులు, ప్రేక్షకులు బలమైన నమ్మకం పెట్టుకున్నారు. మరి ఆ నమ్మకాన్ని సూర్య నిలబెట్టుకుంటాడో లేదో తెలియాలంటే మరో నాలుగు రోజులు ఎదురు చూడాల్సిందే. సూర్య సినిమాకు టాక్ వస్తే, కచ్చితంగా తెలుగు వెర్షన్ వసూళ్లు కూడా అదిరిపోతాయి. తమిళ వెర్షన్ వసూళ్లను దాటేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఏమి జరగబోతుందో చూడాలి. మరోపక్క ఈ సినిమా విడుదలైన రోజునే నేచురల్ స్టార్ నాని ‘హిట్ 3’ చిత్రం విడుదల కాబోతుంది. దీనికి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి. మరి విన్నర్ గా ఎవరు నిలవబోతున్నారో చూడాలి.
Also Read : రెట్రో’ చిత్రాన్ని మిస్ చేసుకున్న సూపర్ స్టార్ అతనేనా..?