Allu Arjun and Allu Aravind : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి దక్కినటువంటి క్రేజ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun)… పాన్ ఇండియాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ఈయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధించినప్పటికి తనకంటూ ఒక గొప్ప గుర్తింపు సంపాదించుకునే దిశగా ముందుకు సాగుతూ ఉండడం విశేషం. కెరియర్ స్టార్టింగ్ లో సాఫ్ట్ సినిమాలను చేసుకుంటూ వచ్చిన ఆయన ఒకానొక దశలో మాస్ హీరోగా మారాలనే ఉద్దేశ్యంతో బోయపాటి శీను లాంటి దర్శకుడితో సరైనోడు (Sarainodu) సినిమా చేసి భారీ సక్సెస్ ని సాధించాడు. కెరియర్ స్టార్టింగ్ లోనే ఆయనకు చాలా మంచి ఆఫర్స్ అయితే వచ్చాయి. అయినప్పటికి మాస్ హీరోగా తనను తాను ఎలివేట్ చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో క్లాస్ సినిమాలకి మాత్రమే పరిమితమయ్యాడు. ఇక బోయపాటి శ్రీను మొదటి సినిమా అయిన భద్ర మూవీ కథ మొదట అల్లు అర్జున్ దగ్గరికే వెళ్ళింది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ కాంబినేషన్ అయితే సెట్ అవ్వలేదు. ఇక ఆ తర్వాత శ్రీనువైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో రవితేజ (Raviteja) హీరోగా వచ్చిన వెంకీ (Venki) సినిమాకి కూడా మొదటి ఛాయిస్ అల్లు అర్జున్ నేనట.
కానీ ఆ సినిమా కథ అల్లు అరవింద్ కి నచ్చకపోవడంతో ఆయన ఆ కథను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ రెండు సినిమాలను కనక అల్లు అర్జున్ చేసి ఉంటే ఆయన స్టార్ డమ్ అనేది మరింత పెరిగి ఉండేది. ఇక రెండు సినిమాలు కూడా రవితేజ కి చాలా వరకు ప్లస్ అయ్యాయి.
ఇక మొత్తానికైతే అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియాలో తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవడమే కాకుండా గొప్ప గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. కాబట్టి ఆయనకు చాలా గొప్ప విజయాలు వరించే అవకాశాలైతే ఉన్నాయి.
ఇకమీదట ఆయన పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా ఎదిగిన ఆశ్చర్యపోనవసరం లేదంటూ సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఇలా ప్రస్తుతం అట్లీ (Atlee) డైరెక్షన్లో సినిమా చేస్తున్న అల్లు అర్జున్ ఆ తర్వాత చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : ఇంస్టాగ్రామ్ లో అల్లు అర్జున్ ని ‘Unfollow’ కొట్టిన రామ్ చరణ్..వివాదం తారాస్థాయికి చేరిపోయిందిగా!