Allu Aravind : గత కొంతకాలం గా మెగా, అల్లు అభిమానుల మధ్య సోషల్ మిడియా లో ఏ రేంజ్ లో గొడవలు జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గత ఏడాది వరకు కూడా పవన్ కళ్యాణ్(Pawan Kalyan), అల్లు అర్జున్(Allu Arjun) అభిమానులు సోషల్ మీడియా లో ఎంతో స్నేహంగా ఉండేవారు. కానీ ఎప్పుడైతే అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి సపోర్టు చేయడానికి నంద్యాలకు వెళ్ళాడో, అప్పటి నుండి ఈ ఇరువురి హీరోల అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో వివాదాలు మొదలయ్యాయి. మధ్యలో అల్లు అర్జున్ కూడా వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు చేయకపోగా, అగ్ని లో పెట్రోల్ కాస్త పోసినట్టు కామెంట్స్ చేసాడు. ఇక రీసెంట్ గా అల్లు అరవింద్ అయితే ‘గేమ్ చేంజర్’ చిత్రం ఫలితాన్ని ఉదహరిస్తూ ‘తండేల్'(Thandel Movie) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ పెద్ద కాంట్రవర్సీ కి తెరలేపింది.
అల్లు అరవింద్(Allu Aravind) కి తన మేనల్లుడి సినిమా ఫ్లాప్ అయితే ఎంత ఆనందంగా ఉందో మీరే చూడండి అంటూ మెగా అభిమానులు ఫైర్ అవుతూ ఆయనపై ఎన్నో ట్రోల్స్ వేశారు. దీనికి అల్లు అరవింద్ రీసెంట్ గా ఏర్పాటు చేసిన ఒక ప్రెస్ మీట్ లో విలేఖరి సోషల్ మీడియా లో జరుగుతున్న రచ్చ గురించి ఆయన దృష్టికి తీసుకొని వెళ్లగా, నో కామెంట్స్ అంటూ సమాధానం ఇచ్చి వివాదాన్ని మరింత ముదిరిపోయేలా చేసాడు. కానీ నేడు ఆయన ఈ అపోహాలపై ఫుల్ స్టాప్ పెట్టాడు. ఆయన మాట్లాడుతూ ‘తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నేను ‘గేమ్ చేంజర్’ సినిమా ఫలితం పై సెటైర్లు వేశానని మెగా అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు బాగా హార్ట్ అయ్యి నాపై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోల్స్ వేశారు. ఆరోజు నేను చేసిన కామెంట్స్ కి వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను’.
‘ఆరోజు నేను కేవలం దిల్ రాజు గారి పరిస్థితిని, వారం రోజుల్లో ఆయన ఎదురుకున్న సంఘటనలను మాత్రమే చెప్పుకొచ్చాను. అంతే కానీ ఉద్దేశపూర్వకంగా చేసిన కామెంట్స్ అసలు కాదు. రామ్ చరణ్(Ram Charan) నా కొడుకు లాంటోడు. నాకు ఉన్న ఏకైక మేనల్లుడు. మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఎంతో విలువైనది. అభిమానులు ఇది అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఆరోజు నేను చేసిన కామెంట్స్ కి మీరంతా బాధ పడుంటే నేను క్షమాపణలు చెప్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. మెగా అభిమానులు కూడా శాంతించారు. ఇలా అల్లు అర్జున్ కూడా నంద్యాల కి వెళ్ళినప్పుడు, పవన్ కళ్యాణ్ అభిమానులు హృదయాలు నొచ్చుకున్నప్పుడు వివరణ ఇస్తూ మాట్లాడి ఉండుంటే చాలా బాగుండేది. పుష్ప 2 చిత్రం అంతటి నెగటివిటీ ని ఎదురుకునేది కాదు, ఆయన అరెస్ట్ అయ్యినప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు అండగా నిలబడేవారు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
#RamCharan నా కొడుకు లాంటివాడు.. నేను ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు.
– #AlluAravind pic.twitter.com/GAIT3LP1Aq
— Gulte (@GulteOfficial) February 10, 2025