https://oktelugu.com/

చిన్ననాటి భరతుడి పాత్రలో చిన్నారి అర్హ !

అల్లు అర్జున్ గారాలపట్టి ‘అల్లు అర్హ’ తెలుగు వెండితెర పై ఎంట్రీ ఇవ్వబోతుందని అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుండి, బన్నీ ఫ్యాన్స్ తమ సంతోషాన్ని కామెంట్ల రూపంలో సోషల్ మీడియాలో వెల్లువలా కురిపిస్తున్నారు. శాకుంతలం అల్లు అర్హ కీలక పాత్రలో కనిపించబోతుంది. దర్శకుడు గుణశేఖర్ అర్హ పాత్రను చాల క్యూట్ గా డిజైన్ చేశాడట. పైగా ఇప్పటికే అర్హ షూట్ లో కూడా పాల్గొంది. అర్హ పై 10 రోజుల పాటు షూటింగ్ చేస్తారు. మరి ఇంతకీ […]

Written By:
  • admin
  • , Updated On : July 16, 2021 / 10:30 AM IST
    Follow us on

    అల్లు అర్జున్ గారాలపట్టి ‘అల్లు అర్హ’ తెలుగు వెండితెర పై ఎంట్రీ ఇవ్వబోతుందని అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుండి, బన్నీ ఫ్యాన్స్ తమ సంతోషాన్ని కామెంట్ల రూపంలో సోషల్ మీడియాలో వెల్లువలా కురిపిస్తున్నారు. శాకుంతలం అల్లు అర్హ కీలక పాత్రలో కనిపించబోతుంది. దర్శకుడు గుణశేఖర్ అర్హ పాత్రను చాల క్యూట్ గా డిజైన్ చేశాడట.

    పైగా ఇప్పటికే అర్హ షూట్ లో కూడా పాల్గొంది. అర్హ పై 10 రోజుల పాటు షూటింగ్ చేస్తారు. మరి ఇంతకీ అర్హది ఏ పాత్ర అంటే.. చిన్ననాటి భరతుడి పాత్ర. భరతుడి పాత్రలో చిన్నారి అర్హ కనిపిస్తే.. ఈ సినిమాకి మరింత పాపులారిటీ రావడం గ్యారంటీ. ఇక గుణశేఖర్ కి ఇలా స్టార్ వారసుల్ని తెరపైకి తీసుకురావడం ఆనవాయితీ అయిపోయింది.

    ఎన్టీఆర్ ను ‘బాల రామాయాణం’తో మొదటిసారి హీరోని చేసింది గుణశేఖరే. ఇప్పుడు అర్హను కూడా వెండితెరకు పరిచయం చేయబోతున్నాడు. మొదట అర్హను అప్పుడే సినిమాల్లోకి తీసుకురావడం బన్నీకి ఇష్టం లేదట. కానీ, గుణశేఖర్ మీద ఉన్న నమ్మకం, అలాగే అతనితో ఉన్న అనుబంధం కారణంగా బన్నీ చివరకు ఒప్పుకోక తప్పలేదు. మొత్తమ్మీద అల్లు ఫ్యామిలీ నుంచి నాలుగో తరం వారసురాలిగా మొదట అర్హ ఎంట్రీ ఇవ్వడం విశేషమే.

    అయాన్ కంటే ముందే అర్హ వెండితెర పై చిరునవ్వులు చిందించనుంది. అయితే అర్హ ఎంట్రీ గత ఏడాదే జరగాలి. దిల్ రాజు తన బ్యానర్ లో ‘లిటిల్ సోల్జర్స్’ తరహాలో ఓ డిఫరెంట్ సినిమా ప్లాన్ చేశాడు. ఈ సినిమాలో స్టార్ కిడ్స్ ను తీసుకుని వారి పై సినిమా చేయాలనుకున్నారు. కానీ, అంతలో కరోనా రావడంతో ఈ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది.

    ఇక అర్హ ఎంట్రీ పై బన్నీ ఓ పోస్ట్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు. ‘శాకుంతలం సినిమాతో అల్లు వారి నాలుగో తరం కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోంది. మాకు ఇది గర్వించే సమయం. గుణ శేఖర్ ఈ సినిమాతో తన కూతురితో పాటు నా కూతురిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. అలాగే నేను గతంలో సమంతతో కలిసి నటించాను. ఇప్పుడు నా కూతురు కూడా నటిస్తుండటం ఆనందంగా ఉంది. శాకుంతలం టీమ్ కు ఆల్ ది బెస్ట్’ అంటూ బన్నీ ఒక మెసేజ్ పోస్ట్ చేశాడు.