అనర్హత వేటు: రఘురామకు షాక్

వైసీపీ, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై పోరు తారాస్థాయికి చేరుకుంది. రెండేళ్లుగా వైసీపీ పోరాటం చేస్తూనే ఉంది. స్పీకర్ ఓం బిర్లాకు పలుమార్లు విన్నవించి ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరింది. అయినా స్పీకర్ స్పందించకపోవడంతో పార్లమెంట్ ను స్తంభింప చేస్తామని హెచ్చరికలు సైతం జారీ చేసింది. దీంతో ఎట్టకేలకే విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఓం బిర్లా ఎంపీ రఘురామపై చర్యలకు ఉపక్రమించారు. మొదటిసారి రఘురామకు నోటీసులు జారీ చేశారు. పిరాయింపుల చట్టం కింద […]

Written By: Srinivas, Updated On : July 16, 2021 10:15 am
Follow us on

వైసీపీ, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై పోరు తారాస్థాయికి చేరుకుంది. రెండేళ్లుగా వైసీపీ పోరాటం చేస్తూనే ఉంది. స్పీకర్ ఓం బిర్లాకు పలుమార్లు విన్నవించి ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరింది. అయినా స్పీకర్ స్పందించకపోవడంతో పార్లమెంట్ ను స్తంభింప చేస్తామని హెచ్చరికలు సైతం జారీ చేసింది. దీంతో ఎట్టకేలకే విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఓం బిర్లా ఎంపీ రఘురామపై చర్యలకు ఉపక్రమించారు. మొదటిసారి రఘురామకు నోటీసులు జారీ చేశారు.

పిరాయింపుల చట్టం కింద వైసీపీ చేసిన ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలంటూ ఎంపీ రఘురామకు లోక్ సభ సెక్రటేరియట్ గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.15 రోజుల్లోగా ఈ షోకాజ్ నోటీసులకు ఎంపీ రఘురామ సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని లోక్ సభ సెక్రటేరియట్ పేర్కొంది. ఫిరాయింపు వ్యవహారంలో ఇరు పక్షాల వాదనలూ విన్న తరువాతే నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ ఓం బిర్లా ఇటీవల చెప్పిన విధంగా ఇప్పుడు లోక్ సభ సెక్రటేరియట్ ఎంపీ వివరణ కోరింది.

అనర్హత వేటు వ్యవహారానికి సంబంధించి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుతోపాటు బెంగాల్ కు చెందిన మరో ఇద్దరు ఎంపీలకు సైతం షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. బెంగాల్ ఎంపీలు శిశిర్ అధికారి, సునీల్ కుమార్ మండల్ టీఎంసీ నుంచి గెలుపొంది, ఆ తరువాత బీజేపీలోకి ఫిరాయించారు. వీరిని అనర్హులుగా ప్రకటించాలన్న టీఎంసీ ఫిర్యాదు మేరకు ఇవాళ లోక్ సభ సెక్రటేరియట్ నోటీసులు జారీ చేసింది.

రెండేళ్లుగా వైసీపీ, రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంలో తీవ్ర యుద్ధం జరుగుతూనే ఉంది. ఆయనపై అనర్హత వేటు వేయించాలని వైసీపీ ఎంపీలు తుది వరకు పోరాడారు. పార్టీకి జరుగుతున్న నష్టం నివారణకు నడుం బిగించారు. అవసరమైతే పార్టమెంట్ ను స్తంభింప చేస్తామని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోవైసీపీ ఎంపీల పంతం చివరకు నెగ్గింది. రఘురామకు నోటీసు జారీ చేయడంతో ఇక చాలనే కోణంలో వైసీపీ భావిస్తోంది.