https://oktelugu.com/

‘పుష్ప’ ఆగస్టు 13న విడుదల !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ అయింది. ఆగస్టు 13న విడుదల అవ్వనుంది. అయితే, ఇంత పెద్ద భారీ సినిమాని తక్కువ టైమ్ లో రెడీ చేయగలరా ? లేదా? అన్నదే ఇక్కడ ప్రశ్న. అసలు సుకుమార్ సినిమాని ఇంత ఫాస్ట్ గా రెడీ చేస్తాడని అని నమ్మకం లేదు. మరి చూడాలి సుక్కు ఏం చేస్తాడో. మరోపక్క బన్నీ ఈ […]

Written By:
  • admin
  • , Updated On : January 28, 2021 / 12:46 PM IST
    Follow us on


    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ అయింది. ఆగస్టు 13న విడుదల అవ్వనుంది. అయితే, ఇంత పెద్ద భారీ సినిమాని తక్కువ టైమ్ లో రెడీ చేయగలరా ? లేదా? అన్నదే ఇక్కడ ప్రశ్న. అసలు సుకుమార్ సినిమాని ఇంత ఫాస్ట్ గా రెడీ చేస్తాడని అని నమ్మకం లేదు. మరి చూడాలి సుక్కు ఏం చేస్తాడో. మరోపక్క బన్నీ ఈ సినిమాను వీలయినంత ఫాస్ట్ గా రెడీ చేసి, కొరటాల శివతో సినిమాని మొదలు పెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

    Also Read: నట వారసుడితో ‘సోషల్ మీడియా బ్యూటీ’ !

    కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లిలో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూలు తరువాత హైదరాబాద్ షెడ్యూలు వుంటుందని, ఆ తరువాత కేరళ షెడ్యూలు ఉంటుందని సమాచారం. ఇక ఈ సినిమాలో ఓ డిగ్లామర్‌ పాత్ర కోసం అనసూయను అడిగార‌ని, మేకప్‌ లేకుండా నటించడం ఇష్టం లేక ఈ ఆఫర్‌కు సున్నితంగానే ఆమె నో చెప్పిన‌ట్టు వార్తలు వచ్చాయి. అయితే తనకు బ్రేక్ ఇచ్చిన సుకుమార్ కే అనసూయ తాజాగా ఒకే చెప్పిందట. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర నటించబోతున్నాడట.

    Also Read: చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేసిన త్రివిక్రమ్, థమన్ !

    నిజానికి ఈ సినిమాలో తమిళ హీరో విజయ్‌ సేతుపతి ఓ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించాలి. కరోనా కారణంగా షెడ్యూల్స్ అన్ని మిస్ అయి.. డేట్స్ అన్ని క్రాస్ అయి మొత్తానికి విజయ్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. ఈ పాత్రలో తమిళ్ హీరో ఆర్యను తీసుకోవాలని సుకుమార్ ప్లాన్ చేసినా అది ఇంకా ఫైనల్ అవ్వలేదు. అలాగే ఈ సినిమాలో ఓ సాంగ్ లో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలా నటిస్తోంది. అలాగే వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న ఈ సినిమాలో ఓ గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్