https://oktelugu.com/

హెచ్1బీ సహా భారతీయులకు జోబైడెన్ గుడ్ న్యూస్

తెంపరితనంతో ట్రంప్ తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెక్ పెడుతున్నారు. వరుసగా డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలను రద్దు చేస్తూ అందరికీ ఊరట కల్పిస్తున్నాడు. ముఖ్యంగా విదేశీ వలసదారులపై ఉక్కుపాదం మోపి ట్రంప్ కఠిన నిర్ణయాలను జోబైడెన్ వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో హెచ్1బీ వీసా నిపుణులు, భారతీయులకు గొప్ప ఊరట లభిస్తోంది. జోబైడెన్ తీసుకున్న నిర్ణయం హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు భారీ ఊరట కల్పించింది. ఈ నిర్ణయం భారతీయ టెకీలకు కూడా […]

Written By:
  • NARESH
  • , Updated On : January 28, 2021 / 12:43 PM IST
    Follow us on

    తెంపరితనంతో ట్రంప్ తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెక్ పెడుతున్నారు. వరుసగా డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలను రద్దు చేస్తూ అందరికీ ఊరట కల్పిస్తున్నాడు. ముఖ్యంగా విదేశీ వలసదారులపై ఉక్కుపాదం మోపి ట్రంప్ కఠిన నిర్ణయాలను జోబైడెన్ వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో హెచ్1బీ వీసా నిపుణులు, భారతీయులకు గొప్ప ఊరట లభిస్తోంది.

    జోబైడెన్ తీసుకున్న నిర్ణయం హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు భారీ ఊరట కల్పించింది. ఈ నిర్ణయం భారతీయ టెకీలకు కూడా ఎంతో ప్రయోజనం కలిగిస్తోంది. జోబైడెన్ కేబినెట్ లో చాలామంది భారతీయులు ఉండడంతో ఈ ప్రోద్బలంతోనే భారతీయులు సహా విదేశీ హెచ్1బీ నిపుణులకు ఊరట కలిగిందని చెప్పొచ్చు.

    హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములైన భార్య లేదా భర్తతోపాటు 21 ఏళ్లలోపు పిల్లలకు అమెరికా పౌరసత్వంతోపాటు హెచ్4 వీసాలు జారీ చేస్తుంటారు. అయితే హెచ్4 వీసాదారులు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు వీలుండేది కాదు.. దీంతో హెచ్1బీ వీసాదారులపై అమెరికాలో అధిక భారం పడేది.కుటుంబంలోని సభ్యులు పనిచేయడానికి వీల్లేకుండా ట్రంప్ నిబంధనలు మార్చారు. ఈ నేపథ్యంలో హెచ్4 వీసాదారులు చట్టపరంగా అమెరికాలో ఉద్యోగం చేసుకునేలా పనికి అనుమతిస్తూ 2015లో అప్పటి ఒబామా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

    ఈ క్రమంలోనే ట్రంప్ రద్దు చేసిన హెచ్4వీసాలపై నిర్ణయాన్ని జోబైడెన్ వెనక్కి తీసుకున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువరించేందుకు సిద్ధమయ్యారు. ఈ నిర్ణయం ఎంతో మంది భారతీయులకు ఊరట కలిగించనుంది. అమెరికాలో ఎంతో మంది విదేశీ మహిళలు, వైద్యంతోపాటు అనేక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. భారతీయులూ లక్షల్లో ఉన్నారు. కరోనా టైంలో వారి అవసరం అమెరికాకు ఎంతో ఉండడంతో జో బైడెన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.