ప్రభాస్.. యంగ్ రెబల్ స్టార్.. బాహుబలితో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కూడా.. అలాంటి ప్రభాస్ దేశవ్యాప్త సినిమాల్లో హీరోయిన్ గా అవకాశం రావడం అంటే పెట్టి పుట్టుండాలి. ఇప్పటికే దీపిక పడుకొనే లాంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లతో మూవీలు చేస్తున్న ప్రభాస్ తన కొత్త సినిమాలో దక్షిణాది హీరోయిన్ కు ఛాన్స్ ఇచ్చాడు.
కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో దేశవ్యాప్తంగా షేక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్. అతడు త్వరలో చేయబోయే చిత్రం ‘సలార్’. ప్రభాస్ ఇందులో హీరో. ఈ క్రమంలోనే ప్రభాస్ కు జోడిగా ఏ హీరోయిన్ ను ఎంపిక చేస్తారన్న ఊహాగానాలకు ప్రశాంత్ నీల్ తెరదించాడు.
గురువారమైన ఈరోజు స్టార్ హీరోయిన శృతి హాసన్ పుట్టినరోజు. ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పిన ప్రశాంత్ నీల్ తాజాగా ‘సలార్’లో హీరోయిన్ గా శృతిని ప్రకటించి సంచలనం సృష్టించారు. సలార్ చిత్రంలో హీరోయిన్ గా శృతి ఫిక్స్ అయినట్టు ప్రకటించాడు.
విశ్వనటుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి వచ్చిన శృతి దక్షిణాదిలో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోలతో నటించింది. వ్యక్తిగత కారణాలతో రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. ప్రస్తుతం మళ్లీ కెరీర్ పై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఏకంగా పాన్ ఇండియా సినిమాలో చాన్స్ కొట్టేసింది.
https://twitter.com/prashanth_neel/status/1354649218430824448?s=20