
దిగ్గజ దర్శకుడి కుమారుడిగా సినిమాల్లోకి వచ్చిన నరేశ్ అల్లరి కుర్రోడిగా తనకంటూ ప్రత్యేకను సంపాదించుకున్నాడు. విలక్షణ నటుడిగా ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇలా తక్కువ సమయంలోనే యాబై సినిమాలు పూర్తి చేసుకున్నాడు నరేశ్. కామెడీ హీరోగా పేరు పొందిన ఈ టాల్ బాయ్.. మధ్యలో కొన్ని ప్రయోగాత్మకమైన చిత్రాలు సైతం చేశాడు. అందులో మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం ‘నాంది’ ఒకటి. పది రోజుల క్రితం విడుదలైన నాంది సినిమాతో నరేశ్ మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు.
Also Read: నటి హిమజకు లేఖ రాసి సంచలనం సృష్టించిన పవన్ కళ్యాణ్.. కారణమిదే?
కామెడీ హీరోగా పేరు సంపాదించిన నరేశ్.. అప్పుడప్పుడు యాక్టిగ్ స్కోప్ ఉన్న చిత్రాల్లోనూ నటించి.. మెప్పించాడు. ఈ క్రమంలో విజయ్ కనమేడ దర్శకత్వంలో నాంది అనే సినిమాలో నటించాడు. క్రైం థ్రిల్లర్ గా రూపొందించిన ఈ చిత్రాన్ని సతీశ్ వేగేశ్న నిర్మించారు. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించి ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.
అల్లరి నరేశ్ కు ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా మార్కెట్ దక్కడం లేదనే చెప్పాలి. అయినప్పటికీ.. నాంది ఫస్ట్ లుక్ లో బట్టలు లేకుండా కనిపించి షాక్ ఇచ్చాడు. దీనికి తోడు టీజర్, ట్రైలర్ తో సినిమాపై బజ్ ఏర్పడింది దీంతో నైజాం రూ.కోటి, సీడెడ్ రూ.30 లక్షలు, ఆంధ్రా రూ.1.20 కోట్లు, ఓవర్సిస్ రూ.20 లక్షలు మొత్తంగా ఈ సినిమాకు రూ.2.70 కోట్ల వ్యాపారం జరిగింది.
Also Read: ఆమె గ్రేసే ఆ డైరెక్టర్ కి ప్లస్ !
ఎన్నో అంచనాల నడుమ నాంది సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనితో పాటే మరో మూడు సినిమాలు అదే రోజు విడుదల అయ్యాయి. ఉప్పెన ప్రభావం కూడా ఇంకా ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ సినిమా విజయంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఊహించని విధంగా అల్లరి నరేశ్ వన్ మెన్ షోతో సినిమాను హిట్ చేసుకున్నాడు. తద్వారా కలెక్షన్లు కూడా అందుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా నాంది సినిమాకు రూ.2.70 కోట్ల వ్యాపారం జరగడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రూ.3కోట్లుగా నిర్ణయించారు. ఇక ఈ సినిమా పదిరోజుల్లో రూ.4.43 కోట్లు వసులు చేసింది. అంటే ఈ సినిమాకు ఇప్పటి వరకు రూ.1.43 కోట్ల లాభం వచ్చింది. పదిరోజులైనా సినిమా హవా కొనసాగుతుండంతో పెట్టుబడికి డబుల్ వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్