https://oktelugu.com/

ప్యాకెట్ పాలు చిన్న పిల్లలకు పట్టించవచ్చా..? పట్టించకూడదా..?

ప్రతిరోజూ పాలు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనే సంగతి తెలిసిందే. అయితే ప్యాకెట్ పాలు తాగడం మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రాసెస్‌ చేసిన పాల ఉత్పత్తులను వినియోగిస్తే అనేక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. మనం రోజూ హోటళ్లు, టీ స్టాళ్లలో తాగే కాఫీ, టీలలో ఎక్కువగా ప్యాకెట్ పాలే వినియోగిస్తున్నారు. Also Read: ముఖానికి మేకప్ వేసుకుంటున్నారా.. చేయకూడని తప్పులు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 2, 2021 11:45 am
    Follow us on

    Packet Milk

    ప్రతిరోజూ పాలు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనే సంగతి తెలిసిందే. అయితే ప్యాకెట్ పాలు తాగడం మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రాసెస్‌ చేసిన పాల ఉత్పత్తులను వినియోగిస్తే అనేక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. మనం రోజూ హోటళ్లు, టీ స్టాళ్లలో తాగే కాఫీ, టీలలో ఎక్కువగా ప్యాకెట్ పాలే వినియోగిస్తున్నారు.

    Also Read: ముఖానికి మేకప్ వేసుకుంటున్నారా.. చేయకూడని తప్పులు ఇవే..?

    సెంట్రిఫ్యూజ్‌ అనే పద్ధతిలో పాలలోని ప్రొటీన్లు, కొవ్వు, నీటిని వేరు చేసి ప్యాకెట్ పాలను తయారు చేస్తారు. ప్యాకెట్ పాలు చిన్నపిల్లలకు మంచివి కాదని.. చిన్నపిల్లల్లో అనేక ఆరోగ్య సమస్యలకు ఈ పాలు కారణమవుతాయని వైద్యులు చెబుతున్నారు. ప్యాకెట్ పాలు పెద్దల్లో గుండె, రక్తనాళాల జబ్బులకు కారణమవుతున్నట్టు శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది. ప్యాకెట్ పాలు నిల్వ ఉండేందుకు వాటిలో పోర్సిలిన్‌ తరహా రసాయనాలను కంపెనీలు కలుపుతున్నాయి.

    Also Read: మొలకలు ఎలా తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా..?

    ఇలా కెమికల్స్ కలిపిన పాలను తీసుకుంటే శరీరానికి తీవ్రస్థాయిలో నష్టం కలుగుతోందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. మానవశరీరంపై కృత్రిమ పాలు, కల్తీ పాలు తీవ్ర ప్రభావం చూపుతుండటం గమనార్హం. ప్యాకెట్ పాలతో పోలిస్తే కృత్రిమ పాలు మరింత ప్రమాదకరం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. రసాయనాలతో కూడుకున్న కృత్రిమ పాల వల్ల శరీరంలోని అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతుంది.

    మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

    కృత్రిమ పాలను చిన్నపిల్లలు తాగడం వల్ల వాంతులు, విరేచనాలు, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కృత్రిమ పాలు జీర్ణకోశ వ్యాధులతో పాటు క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడటానికి కూడా కారణమవుతాయి.