https://oktelugu.com/

పోలీస్ గా దర్శనమిచ్చిన హాట్ బ్యూటీ ! 

సౌత్ హాట్ బ్యూటీస్ లిస్ట్ లో ‘శ్రద్దా దాస్’ పేరును ప్రముఖంగా ముచ్చటించుకోవాలి.  ఎంతమంది ఐటమ్ గర్ల్స్  అండ్ బోల్డ్ హీరోయిన్స్ వచ్చినా,  నాలుగైదు ఏళ్లకే ఫేడ్ అవుట్ అయిపోతారు. కానీ, పద్నాలుగు ఏళ్ల కెరీర్ లో ఇప్పటికీ అదే ఫిజిక్ ను, అదే గ్లామర్ ను మెయింటైన్ చేస్తూనే ఉంది ‘శ్రద్దా దాస్’. అయితే తాజాగా ఈ బ్యూటీ  పోలీస్ గా దర్శనమిచ్చింది. ఒక కొత్త సినిమాలో ఈ ముదురు హీరోయిన్ ఒక పోలీస్ క్యారెక్టర్ లో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 31, 2020 / 03:52 PM IST
    Follow us on

    సౌత్ హాట్ బ్యూటీస్ లిస్ట్ లో ‘శ్రద్దా దాస్’ పేరును ప్రముఖంగా ముచ్చటించుకోవాలి.  ఎంతమంది ఐటమ్ గర్ల్స్  అండ్ బోల్డ్ హీరోయిన్స్ వచ్చినా,  నాలుగైదు ఏళ్లకే ఫేడ్ అవుట్ అయిపోతారు. కానీ, పద్నాలుగు ఏళ్ల కెరీర్ లో ఇప్పటికీ అదే ఫిజిక్ ను, అదే గ్లామర్ ను మెయింటైన్ చేస్తూనే ఉంది ‘శ్రద్దా దాస్’. అయితే తాజాగా ఈ బ్యూటీ  పోలీస్ గా దర్శనమిచ్చింది. ఒక కొత్త సినిమాలో ఈ ముదురు హీరోయిన్ ఒక పోలీస్ క్యారెక్టర్ లో నటిస్తోంది లేండి.  ప్రముఖ కొరియోగ్రఫర విద్యాసాగర్ దర్శకుడిగా  జగపతిబాబు ప్రధాన పాత్రగా వస్తోన్న ఈ సినిమాలో శ్రద్దా దాస్ లేడి పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ గెటప్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. తనను తానూ ప్రమోట్ చేసుకుంది.
    Also Read : ప్లాప్ హీరోయిన్ కి భారీ ఆఫర్స్ !
    అన్నట్టు ఈ సినిమాలో జగపతిబాబు మెయిన్ లీడ్ అయినా…  కథ ప్రకారం ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే  ‘శ్రద్దా దాస్’ పాత్ర కూడా చాలా  కీలకంగా ఉంటుందని.. పైగా చాన్నాళ్ల తర్వాత తన కెరీర్ లో పూర్తి స్థాయి మెయిన్ లీడ్ గా  నటిస్తోన్న  సినిమా కావడంతో.. ఈ సినిమాకి రెమ్యునిరేషన్ ను ఎక్కువుగా తీసుకోలేదట. కేవలం ఖర్చులకు మాత్రమే నిర్మాత నుండి తీసుకుందట. మరి  ఈ సినిమాతోనైనా ఈ బ్యూటీకి హిట్ వచ్చి  హీరోయిన్ గా అవకాశాలు  పెరగాలని ఆశిద్దాం.  ఇప్పటికే కెరీర్ లో కనీస హిట్  కూడా లేక, బేసిక్  స్టార్ డమ్ ను కూడా సంపాదించలేక.. కెరీర్ ఎండింగ్ దశకు చేరాక కూడా..  ఇంకా చిన్నాచితకా రోల్స్ కే  పరిమితం అయిపోయింది పాపం  ‘శ్రద్దా దాస్’.
    మరి డైరెక్టర్స్ చూపు ‘శ్రద్దా దాస్’  మీద ఎప్పుడు పడుతుందో  ఎప్పుడు ఈమెకు బ్రేక్ వస్తోందో.  ఏమైనా  ‘ఆర్య 2, డార్లింగ్, గుంటూరు టాకీస్, గరుడవేగ’ లాంటి హిట్ చిత్రాల్లో మంచి రోల్స్ చేసినా హీరోయిన్ అనే బ్రాండ్ తెచ్చుకోలేకపోవడం,  బికినితో,  ఫుల్ గా రెచ్చగొట్టే చూపులతో  తన యావత్తు అందాలతో ఎంత కనువిందు చేసినా.. హీరోయిన్ గా  ఏమి సాధించలేకపోవడం ‘శ్రద్దా దాస్’కి బాధాకరమైన విషయమే. భవిష్యత్తులోనైనా  ‘శ్రద్దా దాస్’ సక్సెస్ కావాలని  కోరుకుందాం. 
    Also Read : వెబ్‌ సిరీస్‌లో రేణు దేశాయ్‌ ‘ఆహా’ అనిపిస్తుందా?