Bachhala Malli Trailer : తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో కామెడీ హీరో గా తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజి ని ఏర్పాటు చేసుకున్న హీరో అల్లరి నరేష్. నిన్నటి తరంలో కామెడీ హీరో గా రాజేంద్ర ప్రసాద్ ఎలా అయితే ఒక వెలుగు వెలిగాడో, నేటి తరం లో అల్లరి నరేష్ అలాంటి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. కానీ మధ్యలో ఆయన సినిమాలు చాలా రొటీన్ ని అనిపించేలోపు విమర్శలు ఒక రేంజ్ లో వచ్చాయి. దీంముతో కొంతకాలం గ్యాప్ తీసుకొని అల్లరి నరేష్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల వైపుకి షిఫ్ట్ అయ్యాడు. అలా రూట్ మార్చినప్పుడు ఆయనకీ నాంది లాంటి సూపర్ హిట్ చిత్రం పడింది. ఆ తర్వాత అలాంటి తరహా సినిమాలే చేసాడు కానీ, పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మధ్యలో ‘మహర్షి’, ‘నా సామి రంగ’ వంటి చిత్రాల్లో క్యారక్టర్ రోల్స్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు.
ఇప్పుడు రీసెంట్ గా ఆయన ‘బచ్చలమల్లి’ అనే చిత్రం చేసాడు. సుబ్బు మంగదేవి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 20వ తారీఖున విడుదల అవ్వబోతున్న సందర్భంగా, కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసారు మేకర్స్. ఈ ఈవెంట్ కి నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిథి గా విచ్చేసి ట్రైలర్ ని లాంచ్ చేసాడు. ఈ ట్రైలర్ ని చూస్తే అల్లరి నరేష్ మరో మంచి పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న సినిమాగా అనిపించింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లరి నరేష్ ప్రేమలో విఫలమై, జీవితం మీద వైరాగ్యం చెంది, అనిపించింది చేసుకుంటూ పోయే క్యారక్టర్ చేసినట్టుగా అనిపించింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా ‘హనుమాన్’ ఫేమ్ అమృత అయ్యర్ నటించింది. ఈమెకి కూడా మంచి క్యారక్టర్ పడినట్టు ఉంది. ప్రతీ హీరో కెరీర్ కి ఒక మైల్ స్టోన్ అంటూ ఒకటి ఉంటుంది.
అల్లరి నరేష్ కెరీర్ లో అలాంటి మైల్ స్టోన్స్ చాలానే ఉన్నాయి కానీ, బచ్చలమల్లి చిత్రం మాత్రం ఆయన కెరీర్ లో ఇంకా స్పెషల్ చిత్రం గా నిలుస్తుందని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. రామ్ చరణ్ ‘రంగస్థలం’ చిత్రం ఎలాగో, అల్లరి నరేష్ కి ‘బచ్చల మల్లి’ చిత్రం అలాగ అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 20 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమా క్రిస్మస్ సీజన్ ని పర్ఫెక్ట్ గా ఉపయోగించుకొని, మంచి థియేట్రికల్ షేర్స్ ని సాధించే అవకాశాలు ఉన్నాయని, అల్లరి నరేష్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా ఈ చిత్రం కచ్చితంగా నిలుస్తుందని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అవ్వబోతుందో చూడాలి మరి. ఈ సినిమా ప్రొమోషన్స్ కోసం అల్లరి నరేష్, హీరోయిన్ అమృత రేపు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కి రాబోతున్నారు.