Brahmamudi: బ్రహ్మముడి సీరియల్ లో కావ్య గురించి మీకు తెలుసా? ఈ సీరియల్ చూసే వారికి ఈమె గురించి తెలియకుండా ఉండదు. అయితే కావ్య పాత్రలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటి దీపిక. ఈమె సీరియల్ లో ఎంతో పద్ధతిగా నటిస్తూ అంటే చీరల్లో అందంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ బయట మాత్రం ఎంతో సరదాగా అల్లరి చేష్టలతో చాలా మందిని నవ్విస్తుంటుంది ఈ బ్యూటీ. అంతే కాదు కొన్ని సార్లు ఈమె చేసే కామెంట్లు తనకు తలనొప్పిని కూడా తెచ్చిపెడతాయి. ఎందుకంటే ఆమె కామెంట్స్ వల్ల వివాదాలలో చిక్కుకుంటుంది కావ్య.
అయితే ఇలానే బ్రహ్మముడి సీరియల్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న కావ్య ఇటీవల స్టార్ మా పరివార్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్బంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఈ కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ బ్యూటీ అరియానా దీపికను కొన్ని ప్రశ్నలు అడిగింది. వాటికి కావ్య చాలా కామెంట్లు చేసింది. ఈ ప్రశ్నల్లో భాగంగా మీకు తెలుగు సీరియల్స్ లో ఏ సీరియల్ హీరోలో మీకు డ్రగర్నెస్ కనబడుతుంది అని అడిగింది బిగ్ బాస్ బ్యూటీ అరియానా.
ఈ ప్రశ్నకు దీపికా సమాధానం చెప్పింది. అయితే తనకు సత్యభామ సీరియల్ లో క్రిష్, గుండె నిండా గుడి గంటలు సీరియల్ బాలు అని వారి పేర్లను చెప్పింది. వెంటనే అరియానా మాట్లాడుతూ ఒక్కరి గురించే చెప్పాలి ఇద్దరూ ఆప్షన్ లేదని అంటుంది. ఇక దీపికా కూడా వెంటనే సమాధానం చెబుతూ ప్రస్తుతం ప్రతి ఒక్క అమ్మాయికి ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఉంటున్నారు అని చెప్పుకొచ్చింది. అంటే మీకు కూడా ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని సెకన్ కూడా ఆలస్యం చేయకుండా అరియానా మరో ప్రశ్న వేసింది.
ఇక వెంటనే తనకు బాయ్ ఫ్రెండ్స్ లేరని బాయ్స్ ఫ్రెండ్ గా మాత్రమే ఉన్నారు అని తెలిపింది కావ్య. మరి బాయ్ ఫ్రెండ్స్ లేకుండా అలా మనసులో మాట ఎలా బయటకు వచ్చింది అంటూ అడిగింది. ఈ సందర్బంగా కావ్య ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ అనడంతో పద్దతిగా కనిపించే కావ్యకు ఇద్దరు భాయ్ ఫ్రెండ్స్ నిజంగానే ఉన్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇదిలా ఉంటే ఓ సీరియల్ హీరో తో పీకల్లోతు ప్రేమలో ఉందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఆ ప్రేమ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించిందట కూడా కావ్య. కానీ ఈ బ్యూటీ బాయ్ ఫ్రెండ్ ఎవరు అనే విషయం మాత్రం రహస్యంగానే ఉంది. ఏది ఏమైనా తెలుగమ్మాయి కాకపోయినా తన నటన.. అల్లరితో మాత్రం ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది కావ్య. వంటలక్క తర్వాత ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటి ఎవరు అంటే చాలా మంది ఈ బ్రహ్మముడి కావ్యకే ఓటు వేస్తారు.