spot_img
Homeఎంటర్టైన్మెంట్Bachhala Malli Teaser : బచ్చల మల్లి టీజర్ రివ్యూ: మొరటోడిగా అల్లరి నరేష్,...

Bachhala Malli Teaser : బచ్చల మల్లి టీజర్ రివ్యూ: మొరటోడిగా అల్లరి నరేష్, క్యారెక్టర్ కొత్తగా ఉందే!

Bachhala Malli Teaser  : హిట్ కోసం పరితపిస్తున్న అల్లరి నరేష్ ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్నారు. ఆయన ఎక్కువ సీరియస్ ఇంటెన్స్ సబ్జెక్టులు ఎంచుకుంటున్నారు. తాజాగా ఆయన బచ్చల మిల్లి టైటిల్ తో విలేజ్ ఇంటెన్స్ డ్రామా చేశాడు. ఈ మూవీ విడుదల సమయం దగ్గర పడుతుండగా.. టీజర్ విడుదల చేశారు. మరి టీజర్ ఎలా ఉందో చూద్దాం..

అల్లరి నరేష్ ఒకప్పుడు గ్యారంటీ చిత్రాల హీరో. కామెడీ చిత్రాలతో వరుస హిట్స్ ఇచ్చాడు. అతి తక్కువ సమయంలో హీరోగా 50 సినిమాలు పూర్తి చేయడం విశేషం. రాజేంద్రప్రసాద్, సీనియర్ నరేష్ అనంతరం టాలీవుడ్ లో కామెడీ చిత్రాల హీరోగా అల్లరి నరేష్ బ్రాండ్ నేమ్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఒకప్పటిలా అల్లరి నరేష్ జనాలు చూడటం లేదు. ఆయన కామెడీలో మొనాటమీ రావడంతో బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ పడ్డాయి. ఈ క్రమంలో సీరియస్ సబ్జెక్ట్స్ వైపు అడుగులు వేశారు.

నాంది, ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం, ఉగ్రం చిత్రాల్లో అల్లరి నరేష్ సీరియస్ ఇంటెన్స్ రోల్స్ చేశాడు. కానీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. నాంది కొంచెం పర్లేదు అనిపించుకుంది. కమర్షియల్ గా మాత్రం ఆడలేదు. దాంతో మరలా పంథా మార్చి కామెడీ జోనర్ ట్రై చేశాడు. ఆ ఒక్కటీ అడక్కు టైటిల్ తో కామెడీ చిత్రం చేశాడు. ఇది కూడా నిరాశపరిచింది.

తాజాగా అల్లరి నరేష్ మచ్చల మిల్లి టైటిల్ తో విలేజ్ ఇంటెన్స్ డ్రామా చేస్తున్నాడు. అల్లరి నరేష్ క్యారెక్టరైజేషన్ రఫ్ అండ్ రస్టిక్ గా ఉంది. చెప్పాలంటే డీగ్లామర్ రోల్ చేస్తున్నాడు. ప్రేమించిన అమ్మాయితో నాకు లేని చెడు అలవాటు లేదని చెప్పడం హీరోలోని తెగింపును తెలియజేస్తుంది. చూస్తుంటే ఈ చిత్రంలో అల్లరి నరేష్ తండ్రిని ద్వేషిస్తాడు అనిపిస్తుంది. నరేష్ లుక్, డైలాగ్స్ ఆసక్తి రేపుతున్నాయి.

ఇక నరేష్ కి జంటగా అమృతా అయ్యర్ నటిస్తుంది. రావు రమేష్, రోహిణి, సాయి కుమార్ కీలక రోల్స్ చేస్తున్నారు. మచ్చల మిల్లి చిత్రానికి సుబ్బు మంగాదేవికి దర్శకత్వం వహించారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నారు మరి ఈ చిత్రంతో అయినా.. అల్లరి నరేష్ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి…

Bachhala Malli - Official Teaser | Allari Naresh | Amritha Aiyer | Subbu Mangadevvi | Razesh Danda

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Jeetendra Property: 4.25 లక్షల పెట్టుబడి..450 కోట్లు వచ్చేశాయి.. అదృష్టం అంటే ఈయనదే పో

Jeetendra Property: ఈరోజుల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడితే తప్ప పైసలు సంపాదించలేం. సంపాదించిన డబ్బులు సక్రమమైన మార్గాలలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయి. అప్పుడు మన సొమ్ము...

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...
Oktelugu Epaper
Exit mobile version