https://oktelugu.com/

Chiranjeevi: ఆల్ టైం బ్లాక్ బస్టర్ బాషా, చిరంజీవి చేయాల్సిందా? ఎలా మిస్ అయ్యింది? ఇంట్రెస్టింగ్ స్టోరీ

ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన బాషా మూవీ మెగాస్టార్ చిరంజీవి చేయాల్సింది అట. రజినీకాంత్ ఇమేజ్ ని ఎవరెస్టు కి చేర్చిన ఆ చిత్రం, చిరంజీవి నుండి ఎలా చేజారింది. దీని వెనుక ఓ ఆసక్తికర కథనం ఉంది. అదేమిటో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : November 27, 2024 / 11:22 AM IST

    Chiranjeevi(25)

    Follow us on

    Chiranjeevi: రజినీకాంత్ ఇండియా వైడ్ పాపులారిటీ ఉన్న హీరో. ఆయన కెరీర్లో అనేక బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. కమర్షియల్ హీరోగా ఎవరూ చేరుకోలేని రికార్డ్స్ ఆయన సొంతం. రజినీకాంత్ కెరీర్లో బాషా చిత్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తమిళ, తెలుగు భాషల్లో బాషా ఆల్ టైం బ్లాక్ బస్టర్. అప్పట్లో ఈ సినిమా గురించి విపరీతంగా చర్చ జరిగింది. ఈ సినిమాలో రజినీకాంత్ చెప్పిన డైలాగ్ ‘ఈ బాషా ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టు” దశాబ్దాల పాటు జనాల నోళ్ళలో నానింది. అనేక సినిమాల్లో సూప్స్, మీమ్స్ చేశారు.

    ఈ చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకుడు. ముంబైలో కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్, తన లక్ష్యం కోసం ఆటో వాడిగా మారతాడు. ఈ పాయింట్ జనాలకు భలే నచ్చింది. అసలు ఈ ఆటో వాడి బ్యాగ్రౌండ్ ఏమిటనే సస్పెన్సు ఆడియన్స్ ని కుర్చీలలో నిలవకుండా చేసింది. ఇక ఆ ట్విస్ట్ మైండ్ బ్లాక్ చేస్తుంది. బాషా స్పూర్తితో అనేక సినిమాలు వచ్చాయి. బ్లాక్ బస్టర్స్ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర చిత్రాల స్క్రీన్ ప్లే కి బాషా చిత్రం స్ఫూర్తి.

    అయితే బాషా మూవీని చిరంజీవి చేయాల్సింది అట. కానీ స్ట్రెయిట్ మూవీ కాదు. రీమేక్. బాషా, బిగ్ బాస్ చిత్రాల షూటింగ్స్ ఒకేసారి జరిగాయి. ఈ రెండు చిత్రాల కథ ఒకటే అని అప్పట్లో మీడియాలో పుకార్లు వచ్చాయి. బాషా, బిగ్ బాస్ చిత్రాల షూటింగ్స్ సేమ్ లొకేషన్ లో జరుగుతుండగా.. సురేష్ కృష్ణ బిగ్ బాస్ మూవీ సెట్స్ కి వచ్చాడట. చిరంజీవి, అల్లు అరవింద్ కి కథ చెప్పాడట. ఇద్దరూ చాలా థ్రిల్ ఫీల్ అయ్యారట. రూ. 20 లక్షలకు రీమేక్స్ రైట్స్ కొంటామని డీల్ చేసుకున్నారట.

    అయితే అధికారికంగా అగ్రిమెంట్ జరగలేదట. ఈ లోపు మూవీ విడుదలై భారీ విజయం అందుకుంది. దాంతో రూ. 40 లక్షలకు రీమేక్ రైట్స్ ఇస్తామని అన్నారట. మోహన్ బాబు కూడా బాషా రీమేక్ రైట్స్ కోసం పోటీపడ్డాడట. దాంతో మరింత ఎక్కువ నిర్మాతలు డిమాండ్ చేశారట. చివరికి డబ్బింగ్ రైట్స్ నే రూ. 80 లక్షలు అమ్మారట. తెలుగులో కూడా బాషా సంచలన విజయం సాధించింది. అలా బాషా చిరంజీవి నుండి చేజారింది. మరి తెలుగులో చిరంజీవి చేస్తే ఈ చిత్రానికి ఎలాంటి ఫలితం వచ్చేదో..