https://oktelugu.com/

Samantha: నా ఆరోగ్యం క్షీణించింది అప్పుడే, అసలు విషయం బయటపెట్టిన సమంత.. ఇంత స్ట్రగుల్ కి గురైందా?

సమంత తాజా ఇంటర్వ్యూలో పలు వ్యక్తిగత విషయాలు పంచుకుంటున్నారు. ఆరోగ్యం పాడైన విషయం తనకు ఎప్పుడు తెలిపింది. అలాగే మయోసైట్స్ కారణంగా ఆమె ఎదుర్కొన్న మానసిక,శారీరక వేదన తెలియజేసింది. సమంత మాటలు విన్నాక, ఆమె ఇంత స్ట్రగుల్ అయ్యారా.. అని ఫ్యాన్స్ వాపోతున్నారు. ఇంతకీ ఆమె ఏమన్నారో చూద్దాం...

Written By:
  • S Reddy
  • , Updated On : November 27, 2024 / 11:25 AM IST

    Samantha

    Follow us on

    Samantha: సమంత స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుండగా మయోసైటిస్ రూపంలో బ్రేక్ పడింది. 2022 అక్టోబర్ నెలలో సమంత సోషల్ మీడియా వేదికగా తనకు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి సోకినట్లు తెలియజేసింది. ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్ లో ఏర్పడే సమస్యల కారణంగా తనకు ఈ వ్యాధి సోకింది. సమంత సందేశం ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేసింది. మెగాస్టార్ చిరంజీవి సైతం సమంత సోషల్ మీడియా పోస్ట్ కి స్పందించారు. త్వరలోనే కోలుకుంటావని ధైర్యం చెప్పారు.

    కొద్దిరోజుల్లో యశోద మూవీ విడుదల ఉంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో సైతం సమంత పెద్దగా పాల్గొనలేదు. అతి కష్టం మీద యాంకర్ సుమకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. సదరు ఇంటర్వ్యూలో తన పరిస్థితి తెలియజేసింది. మీడియాలో వస్తున్నట్లు నేనేమీ ఈ వ్యాధి కారణంగా చనిపోవడం లేదు. ఇది పెద్ద సమస్య కాదు, అలా అని చిన్న సమస్య కూడా కాదు. నేను పోరాడాల్సి ఉంది. ఇలాంటి కఠిన పరిస్థితులు నాకు మామూలే. ఫైట్ చేస్తాను, అన్నారు. అనంతరం సమంత కొంత కాలం విరామం తీసుకున్నారు.

    అనేక చోట్ల ఈ మయోసైటిక్ కి చికిత్స తీసుకున్నట్లు సమాచారం. కాగా ఈ వ్యాధి లక్షణాలు తనకు మొదటిసారి ఎప్పుడు కనిపించాయో సమంత వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ.. ”నేను కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నాను. అప్పుడే నాకు నీరసంగా అనిపించింది. షోలో మాత్రం ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నానని, కెరీర్ పై దృష్టి పెడతానని చెప్పాను. షో ముగించుకుని హైదరాబాద్ వచ్చాను. అనంతరం ఖుషి మూవీ షూటింగ్ లో పాల్గొన్నాను. అక్కడ నేను చాలా ఇబ్బంది పడ్డాను. శరీరం షట్ డౌన్ అయిన భావన కలిగింది. అప్పటి నుండి ఆరోగ్యం క్షీణించడం మొదలైంది.

    ఏం జరుగుతుందో నాకు తెలిసేది కాదు. ఆ వ్యాధిని గుర్తించడానికి నాకు చాలా సమయం పట్టింది. అనంతరం నేను ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటో మీ అందరికీ తెలుసు.. అని అన్నారు. ప్రస్తుతం సమంత నటించిన సిటాడెల్ సిరీస్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. దీనికి పాజిటివ్ టాక్ దక్కుతుంది. కాగా సమంత ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఒక బ్యానర్ ఏర్పాటు చేసింది. సొంత నిర్మాణ సంస్థలో మా ఇంటి బంగారం అనే ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది.