https://oktelugu.com/

Joe Biden : పదవీ విరమణ సమయంలో బైడెన్‌ కీలక నిర్ణయం.. ఆ యుద్ధానికి ముగింపు..!

ఏడాదికిపైగా మధ్య–తూర్పు ఆసియా దేశాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హమాస్‌ లక్ష్యంగా గతేడాది అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌ యుద్ధం మొదలు పెట్టింది. అని క్రమంగా విస్తరిస్తూ.. ఇరాన్‌ వరకు పాకింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 27, 2024 / 11:22 AM IST

    Joe Biden

    Follow us on

    Joe Biden : మధ్య, తూర్పు ఆసియా దేశాల్లో.. ఏడాదికిపైగా యుద్ధం కొనసాగుతోంది. హమాస్‌ ఇజ్రాయెల్‌పై దాడిచేసి.. కొతమందిని బందీలుగా పట్టుకోవడంతో ఆగ్రహించిన ఇజ్రాయెల్‌.. హమాస్‌ అంతమే లక్ష్యంగా గతేడాది అక్టోబర్‌లో యుద్ధం మొదలు పెట్టింది. హమాస్‌ను దాదాపుగా అంతం చేసింది. బంధీల్లో చాలా మందిని విడిపించింది. తర్వాత హమాస్‌కు మద్దతుగా వచ్చిన లెబనాన్‌లోని హెజ్‌బొల్లాపైనా విరుచుకుపడింది. హెజ్‌బొల్లా చీఫ్‌లతోపాటు చాలా మందిని అంతం చేసింది. ఇలా తీవ్ర దాడులు, ప్రతిదాడులతో మధ్య, తూర్పు ఆసియా అట్టుడికింది. ఈ క్రమంలో తాజాగా ఇరుపక్షాలు శాంతి మంత్రం వళ్లిస్తున్నాయి ఇజ్రాయెల్‌–లెబనాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. 14 నెలలుగా ఇజ్రాయెల్, గాజా, లెబనాన్‌ పరస్పరం దాడులు చేసుకున్నాయి. గాజాలో హమాస్, లెబనాన్‌లో హెజ్‌బొల్లా మిలిటెంట్‌ గ్రూపులే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ ఈ దాడులు చేసింది.

    చీఫ్‌లను మట్టుబెట్టి..
    ఈ దాడుల్లో… హమాస్, హెజ్‌బొల్లాకు చెందిన చీఫ్‌లను ఇజ్రాయెల్‌ మట్టుపెట్టింది. హమాస్‌ చీఫ్‌ హసన్‌ నస్రల్లా, యాహ్యా సిన్వర్, ఇస్మాయిల్‌ హనియె, సమీ తలెబ్‌ అబ్దుల్లా, ఫతా షరీఫ్, ముర్వాన్‌ ఇసా, ఇబ్రహీం వకీల్, అహ్మద్‌ వహ్బీ వంటి కమండార్లు ఇజ్రాయెల్‌ దాడుల్లో అంతమయ్యారు. భీకర యుద్ధం సాగుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి కూడా జోక్యం చేసుకుంది. కాల్పుల విరమణ ఒప్పందాలను ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 1701 తీర్మానం ఆమోదించింది. దీనిపై ఇజ్రాయెల్, లెబనాన్‌తో శాంతి కుదిర్చే ఆధ్యతను అమెరికా, ఫ్రాన్స్‌ తీసుకున్నాయి శాంతి నెలకొనడానికి మధ్యవర్తితవ్వం వహించాయి.

    ఇరు దేశాలతో చర్చలు..
    అమెరికా, ఫ్రాన్స్‌.. యుద్ధం ఆపేందుకు ఇజ్రాయెల్, లెబనాన్‌ ప్రతినిధులతో చర్చలు జరిపారు. రెండు వారాలుగా సాగుతూ వచ్చిన శాంతి చర్చలు చివరక కొలిక్కి వచ్చాయి. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈమేరకు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహు ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని, దీనిని ఏమాత్రం ఉల్లంఘించిన భీకర దాడులు చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ ఒప్పందం ప్రకారం 60 రోజుల్లో ఇజ్రాయెల్‌–లెబనాన్‌ మధ్య సరిహద్దు ప్రాంతమైన బ్లూ లైన్‌ నుంచి వెనక్కి వెళ్లాలి. లిటానీ నది తీరాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. మిలిటెంట్ల స్థానంలో లెబనాన్‌ ఆర్మీ దళాలను ఆ ప్రాంతంలో మోహరిస్తారు. ఇలాంటి పలు అంశాలపై ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి.

    బైడెన్‌ ప్రకటన..
    ఇదిలా ఉండగా ఇజ్రాయెల్‌–లెబనాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. దీనిపై హర్షం వ్యక్తం చేశారు. బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ కూడా తాజా ఒప్పందంపై హర్షం వ్యక్తం చేశారు. రెండు దేశాలను అభినందించారు. చర్చలతో అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు. ఇది మరోసారి నిరూపితమైందని తెలిపారు.