కాళిదాసు , కరెంట్ చిత్రాలతో హిట్ అందుకున్న సుశాంత్…ఆ తర్వాత సుశాంత్ ఎన్నో సినిమాలు చేసినా కానీ ఇంతవరకు ఒక్క హిట్ కొట్టలేదు. కొంత గ్యాప్ ఇచ్చి ‘చి. ల.సౌ’ తో 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్నాడు. తర్వాత సుశాంత్ నుండి సోలో హీరోగా మూవీ వచ్చి దాదాపు మూడేళ్లు అవుతుంది . గతేడాది ‘అల వైకుంఠపురములో’ లాంటి మూవీతో ప్రేక్షకులని పలకరించినా అది గెస్ట్ రోల్ మాత్రమే. ఎట్టకేలకు ఈ హీరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో కొత్త మూవీతో విడుదలకు సిద్దమయ్యారు.
Also Read: సింగర్ సునీత-రామ్ ల వెడ్డింగ్ టీజర్… వైరల్
ఎస్ దర్శన్ దర్శకత్వంలో “ఇచ్చట వాహనములు నిలుపరాదు” అనే టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. నో పార్కింగ్ అనేది క్యాప్షన్. యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి అప్పుడెప్పుడో విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ మంచి స్పందన తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా నుండి మెయిన్ టీజర్ ని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు ఒక వీడియో ద్వారా తెలియచేశారు.
ఈ వీడియోలో ‘అప్పుడెప్పుడో మార్చి 2020లో ఓ చిన్న టీజర్ వదిలాం,ఆ తర్వాత అన్ని పోస్టర్స్ నే, లాక్ డౌన్ కదా బండి తీయడం కొంచెం లేట్ అయింది, కాస్త దుమ్ము దులుపుదామా అంటూ సుశాంత్ బైక్ తీస్తూ … ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ టీజర్ ని ఈ నెల 29న ఓ స్పెషల్ పర్సన్ సోషల్ మీడియాలో రిలీజ్ చేయనున్నారు. ఆ హీరో ఎవరనేది జనవరి 27న రివీల్ చేయనున్నాం, అప్పటివరకు ఆ పర్సన్ ఎవరనేది గెస్ చేస్తూ ఉండండి అని సుశాంత్ వెల్లడించారు. అక్కినేని హీరో గారి ఆశలన్నీ ఈ మూవీ మీదనే ఉన్నాయట.
Also Read: రెండూ కలిసొచ్చేలా ప్లాన్ చేసిన రాజమౌళి !
ఈ మూవీలో సుశాంత్ కి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఈ సినిమాలో వెంకట్, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం, ఐశ్వర్య, రవివర్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తుండగా,సుకుమార్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఏ1 స్టూడియోస్ మరియు శాస్త్ర మూవీస్ బ్యానర్లపై రవిశంకర్ శాస్త్రి – ఏక్తా శాస్త్రి – హరీష్ కోయలగుండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
Its taken a while but here we go!! 🏍
A very special star that all of us dearly love, is going to launch the teaser of #IVNR #NoParking on Jan 29th! Will let you know who our special guest with a big heart is, on Jan 27th 😉 🔥#IVNRteaserOnJan29th pic.twitter.com/TxcZVlkwS1— Sushanth A (@iamSushanthA) January 25, 2021
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: All the hopes of akkineni hero are on that movie
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com