https://oktelugu.com/

Mahesh Babu-Rajamouli Movie: మహేష్ బాబు రాజమౌళి సినిమాలో నటించనున్న స్టార్ హీరోయిన్…

Mahesh Babu-Rajamouli Movie: మొత్తానికైతే ఈ సినిమాతో మరొకసారి తన స్టామినా ఏంటో చూపించుకోవాలని అటు రాజమౌళి, ఇటు మహేష్ బాబు ఇద్దరూ ఆరాటపడుతున్నట్టుగా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : June 12, 2024 / 12:31 PM IST

    Alia Bhatt to act in Mahesh Babu Rajamouli film

    Follow us on

    Mahesh Babu-Rajamouli Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా మీద ఇప్పటికే మంచి అంచనాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తయినప్పటికీ ఈ సినిమా సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తుంది. అనేదానిమీద ఇంకా సరైన క్లారిటీ అయితే రాలేదు. మరి దాని కోసమే చాలామంది అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

    మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరొకసారి తన స్టామినా ఏంటో చూపించుకోవాలని అటు రాజమౌళి, ఇటు మహేష్ బాబు ఇద్దరూ ఆరాటపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన అలియా భట్ ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక త్రిబుల్ ఆర్ సినిమాలో నటించిన ఆలియా భట్ కి పెద్దగా నటించే అవకాశం అయితే రాలేదు. ఆమె పాత్ర ఒకటి రెండు సీన్ల వరకే పరిమితమైంది. కాబట్టి ఈ సినిమాలో ఆమెకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ను ఇవ్వాలని రాజమౌళి ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది…

    Also Read: Kalki 2898 AD: కల్కి కి దీపికా పదుకొనె ప్లస్సా? మైనస్సా? తేడా కొడితే అంతే!

    మరి ఇలాంటి క్రమంలో అలియా భట్ రీసెంట్ గా ఒక పాప కూడా జన్మించింది. మరి తను సినిమాలు చేస్తుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే ప్రస్తుతం ఆలియా భట్ ను తన సినిమాలో తీసుకోవడానికి రాజమౌళి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆమె ఏ పాత్రలో నటిస్తుంది అనేది ఇంకా సరైన క్లారిటీ లేదు.

    Also Read: Kannappa: కన్నప్ప సినిమాను బాలీవుడ్ ప్రేక్షకులు ఆదరిస్తారా..?

    కానీ మొత్తానికైతే తన సినిమాలో ఉండబోతుంది అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా తొందర్లోనే సెట్స్ మీదికి వెళ్లి 2027 లో రిలీజ్ కాబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి…చూడాలి మరి ఈ సినిమా తో రాజమౌళి ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…